ఒక్కోసారి అంతే మరి. ఒక్క ఫలితం కథంతా మార్చేస్తుంది. ‘ఆగడు’ ఫ్లాపయ్యాక శ్రీను వైట్ల పరిస్థితేంటో అందరూ చూశారు. చాలా కాంప్రమైజ్ ల తర్వాత రామ్ చరణ్ తో సినిమా మొదలైంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా కష్ట కాలంలో ఉన్నాడు. ‘కిక్-2’ డిజాస్టర్ గా నిలవడంతో సురేందర్ పరిస్థితి అయోమయంగా మారింది. నిజానికి ఈ కిక్-2 తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయాలి సురేందర్. మొన్నటి దాకా ఆ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి సందేహాల్లేవు. ‘బ్రూస్ లీ’ పూర్తి కాగానే ఆ సినిమా పట్టాలెక్కడం ఖాయమనుకున్నారు. కానీ ఇప్పుడు చరణ్ మనసు మారిపోయింది. తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’ సినిమాను రీమేక్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. ‘బ్రూస్ లీ’ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యే ఫ్యాన్సీ రేటుకి హక్కులు కూడా తీసేసుకున్నట్లు సమాచారం.
బ్రూస్ లీ తర్వాత చరణ్ చేయబోయేది ‘తనీ ఒరువన్’ రీమేకే అని దాదాపుగా తేలిపోయింది. ఐతే మరి సురేందర్ రెడ్డి పరిస్థితేంటన్నదే తేలకుండా ఉంది. రీమేక్ కే ఛాన్స్ ఇద్దామా అంటే రెండు రకాల ఇబ్బందులున్నాయి. సురేందర్ వేరే కథతో రెడీగా ఉన్నాడు. అతడికి రీమేక్ చేయడం ఇష్టం లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పాటు తెలుగు వెర్షన్ కి కూడా తానే దర్శకత్వం వహించాలని మోహన్ రాజా పట్టుదలతో ఉన్నాడట. ఒరిజినల్ తీసిన వాడికే బాధ్యతలప్పగిస్తే మరీ మంచిదన్న అభిప్రాయంలో చరణ్, దానయ్య కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సురేందర్ బ్రేక్ తీసుకోక తప్పేలా లేదు. మాటిచ్చాక ఎప్పుడో ఒకప్పుడు నిలబెట్టుకోవచ్చులే అన్న ఉద్దేశంతో చరణ్.. సురేందర్ తో సినిమా వాయిదా వేసేస్తున్నాడన్నది ప్రస్తుతానికి మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం. అదే కిక్-2 సూపర్ హిట్టయి ఉంటే.. సురేందర్ కు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? మరి ఈ పరిస్థితుల్లో సురేందర్ ఏం చేస్తాడో చూడాలి.