పాన్ ఇండియా రేస్..మ‌రీ ఇంత లేజీ అయితే ఎలా?

Update: 2022-11-13 15:30 GMT
'బాహుబ‌లి' సెన్సేష‌ల్ హిట్ తో టాలీవుడ్ తో పాటు ద‌క్షిణాది డైరెక్టర్ల‌కు బిగ్ టాస్క్ ని సెట్ చేశాడు రాజ‌మౌళి. 'RRR'తో మ‌రో సారి ఈ రేస్ లో మ‌ళ్లీ ముందు వ‌రుస‌లో ర‌న్నింగ్ చేస్తున్న రాజ‌మౌళిని అందుకోవాల‌ని ఇండ‌స్ట్రీలో వున్న ప్ర‌తీ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని పాన్ ఇండియా మూవీగా మ‌లుస్తూ రేసులో నిల‌వాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే సుకుమార్ 'పుష్ప'తో ఆ ఫీట్ ని సాధించి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల జాబితాలో చేరిపోయాడు.

అంత‌కు ముందే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన సురేంద‌ర్ రెడ్డి విఫ‌ల‌మ‌య్యాడు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ల‌ని ఒకే ఫ్రేమ్ లో చూపిస్తూ 'సైరా న‌ర‌సింహారెడ్డి' మూవీని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ ఆక‌ట్టుకోలేక విఫ‌ల‌మైంది. దీంతో సుకుమార్ కంటే ముందే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల జాబితాలో చేరాల్సిన‌ సురేంద‌ర్ రెడ్డి ఇప్ప‌టికీ వెయిటింగ్ లిస్ట్ లో వుండిపోయాడు.

'అత‌నొక్క‌డే' సినిమాతో స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌తో కెరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తాడ‌నుకున్న సురేంద‌ర్ రెడ్డి త‌న నిదానంగా వెళ్లాల‌నే యాటిట్యూడ్ వ‌ల్ల ఇప్ప‌టికీ వెన‌క‌బ‌డిపోతున్నాడ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. 2005లో 'అత‌నొక్క‌డే' తో సంచ‌ల‌నం సృష్టించిన సురేంద‌ర్ రెడ్డి ఆ త‌రువాత మ‌ళ్లీ కిక్కిచ్చే హిట్ ని సొంతం చేసుకోవ‌డానికి నాలుగేళ్లు ప‌ట్టింది.

2009లో 'కిక్‌' మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ బాట‌ప‌ట్టాడు. ఆ త‌రువాత 2011లో 'రేసు గుర్రం', ఆ త‌రువాత 2016లో 'ధృవ‌'తో స‌క్సెస్ అందుకున్నా అది రీమేక్ మూవీ కావ‌డంతో ఆ స‌క్సెస్ ఆశించిన స్థాయిలో సురేంద‌ర్ రెడ్డి ఖాతాలో చేర‌లేదు. ఇక 'సైరా' గురించి తెలిసిందే.

టెక్నీషియ‌న్ గా మంచి పేరున్నా సురేంద‌ర్ రెడ్డి ఆ స్థాయిలో అగ్రెసీవ్ గా అడుగులు వేయ‌క‌పోవ‌డ‌మే అత‌ని ఎదుగుద‌ల ఆల‌స్యం అవుతుండ‌టానికి ప్ర‌ధాన ప్ర‌తిబంధ‌కంగా మారిన‌ట్టుగా చెబుతున్నారు. త‌న‌కున్న టెక్నిక‌ల్ టాలెంట్ ని పూర్తిగా బ‌య‌ట‌పెట్ట‌గ‌లిగి మ‌రింత హుషారుగా ఉర‌క‌లు వేస్తే సురేంద‌ర్ రెడ్డి ఎప్పుడో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల జాబితాలో చేరిపోయేవాడ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం అఖిల్ తో 'ఏజెంట్‌' మూవీని తెర‌కెక్కిస్తున్నాడు.

త‌న లేజీనెస్ కార‌ణంగానే ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంద‌నే కామెంట్ లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేస్ న‌డుస్తుంటే స్టార్ డైరెక్ట‌ర్ ఇంత లేజీగా సినిమా చేయ‌డం ఏమీ బాగాలేద‌ని ఇండ‌స్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. అది సురేంద‌ర్ రెడ్డి నుంచి ఎప్ప‌డు పోతుందో అప్ప‌డు అత‌ని గొప్ప ద‌ర్శ‌కుడిగా ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటాడ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి కెరీర్ 'ఏజెంట్‌' మూవీ ఫ‌లితంపై ఆధార‌ప‌డి వుంద‌ని, ఈ మూవీ రిజల్ట్ ని బ‌ట్టే బ‌న్నీ సినిమా వుంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News