రాజమౌళి బాటలో సురేందర్ రెడ్డి

Update: 2015-08-22 18:24 GMT
ప్రతి దర్శకుడిలోనూ ఓ నటుడుంటాడు. ఆ లోపలున్నోడికి ఒక్కసారైనా తాను కూడా తెరమీద కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకే దర్శకులు అప్పుడప్పుడూ తెరమీద కనిపిస్తుంటారు. వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్లు వేరేవాళ్ల సినిమాల్లో తళుక్కుమంటే.. ఈ మధ్యే రాజమౌళి తన కళాఖండం ‘బాహుబలి’లో ఓ సన్నివేశంలో కనిపించి అభిమానుల్ని అలరించాడు. జక్కన్న లాగే చాలా సింప్లిసిటీతో ఉండే స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ‘కిక్-2’తో తొలిసారి తెరమీద కనిపించి సందడి చేశాడు. కిక్-2 ఆరంభ సన్నివేశాల్లోనే సురేందర్ రెడ్డి కనిపించడం విశేషం.

కిక్-2లో కథానాయకుడికి తన కంఫర్టే అన్నిటికంటే ముఖ్యం. ఎదుటివాళ్లతో అతడికి సంబంధం ఉండదు. అతడి క్యారెక్టర్ ఏంటో చూపించే ఇంట్రడక్షన్ సీన్ లో సురేందర్ రెడ్డి తళుక్కుమన్నాడు. హీరో ఓ చోట కూర్చుని సిరెగట్ కాలుస్తుంటాడు. పక్కనే ల్యాప్ టాప్ మీద పని చేసుకుంటున్న సురేందర్ రెడ్డి సిగరెట్ తాగడం వల్ల ఇబ్బందిగా ఉందంటాడు. దానికి హీరో.. నా కంఫర్టే ముఖ్యం, నీకిబ్బందిగా ఉంటే పక్కకెళ్లు అంటాడు. అంతలోనే ఇంకో వ్యక్తి వచ్చి హీరో పక్కన కూర్చుని సిగరెట్ కాలుస్తాడు. అప్పుడు హీరో కోప్పడుతూ నాకు కంఫర్ట్ గా లేదు అంటాడు. అతనెళ్లిపోతాడు. ఇంతలో సురేందర్ మళ్లీ వచ్చి.. అదేంటి నువ్వు సిగరెట్ తాగితే తప్పులేదు, అతను తాగితే తప్పా అని అడుగుతాడు. నా కంఫర్టే నాకు అన్నిటికన్నా ముఖ్యం అని సెలవిస్తాడు హీరో. దానికి అవాక్కవుతూ అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు సురేందర్. చిన్నదే కానీ.. చాలా ముఖ్యమైన సన్నివేశంలో కనిపించి తన ముచ్చట తీర్చుకున్నాడు సురేందర్.
Tags:    

Similar News