ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమాల సందడి ఓ రేంజిలో ఉంటుందని ఆశించారు తెలుగు ప్రేక్షకులు. మూణ్నాలుగు సినిమాలు గ్యారెంటీ అనుకుంటే చివరికి ఒక్క ‘గోపాల గోపాల’ మాత్రమే వచ్చింది. పవన్-వెంకీల సినిమాతో పోటీ పడుతుందనుకున్న ‘టెంపర్’ వాయిదా పడిపోవడంతో సంక్రాంతి సమరం చప్పున చల్లారిపోయింది. చివరికి ‘గోపాల గోపాల’తో తమిళ సినిమా ‘ఐ’ పోటీ పడింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ.. భారీగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ‘గోపాల గోపాల’ కంటే కూడా ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఐతే రాబోయే సంక్రాంతికి కూడా ఓ తమిళ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను కొల్లగొట్టడానికి రెడీ అవుతోంది.
ఇష్క్ - మనం సినిమాల తర్వాత దర్శకుడు విక్రమ్ కుమార్.. సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘24’ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ముందు ఈ సినిమాను వేసవికి అనుకున్నారు కానీ.. షూటింగ్ పూర్తయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చకచకా అయిపోతుండటంతో సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. తమిళంలో ఇప్పటిదాకా సంక్రాంతికి ఏ పెద్ద సినిమా షెడ్యూల్ కాలేదు. దీంతో తనే ముందు కర్చీఫ్ వేసేద్దామని చూస్తున్నాడు సూర్య. అతడి సినిమాలు తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతాయన్న సంగతి తెలిసిందే. సూర్య గత సినిమాలు కొంత నిరాశ పరిచినప్పటికీ.. విక్రమ్ మీద తెలుగు ప్రేక్షకులకు మంచి గురి ఉంది కాబట్టి ‘24’ సినిమాకు ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేస్తుంది. పైగా ఆ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తోంది. కాబట్టి ‘24’ సంక్రాంతి బరిలో ఉంటే తెలుగు సినిమాలకు కొంత ఇబ్బందే.