హీరో సూర్య.. అండ్ దర్శకుడు విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ''24''. ఎప్పటినుండో సైంటిఫిక్ ఉన్న పోస్టర్లతో.. అలాగే టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే టీజర్ తో.. ఊరిస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో సినిమా ఆడియో విడుదల కావడంతో.. ఎట్టకేలకు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
ఒక వాచ్ మెకానిక్ (సూర్య) తనకు వీధిలో కనిపించిన అమ్మాయి (సమంత) కు లైన్ వేస్తుంటాడు. ఇంతలో ఒక పాత వాచ్ ను రిపేర్ చేస్తాడు. ఇక అదే వాచ్ కోసం ఒక ముసలాయన (సూర్య) చాలా సీరియస్ గా వెతుకుతుంటాడు. ఇక అదే వాచ్ కోసం ఒక కిల్లర్ (సూర్య) కూడా చూస్తుంటాడు. అసలు ఆ వాచ్ ను కనిపెట్టింది ఎవరంటే.. ఒక సైంటిస్టు (సూర్య) ఆయన భార్య (నిత్యా మీనన్)తో కలసి అది కనిపెట్టాడు. ట్రైలర్ చూస్తే అర్దమైన కథ అదే. అయ్యా.. ఇక '24' అంటే ఒకవేళ ఇరవై నాలుగు గంటలను ఉద్దేశించి ఆయన ఆ టైటిల్ పెట్టాడేమో కాని.. సినిమాలో ఉన్న పాత్రల్లో.. ఒక నాలుగు పాత్రలను మాత్రం సూర్య గారే వేసేశారయ్యా. మనోడికి ఇలాంటి అతి ఇప్పటివరకు కలసి రాలేదు. కాని స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నాడు.
ఇకపోతే ట్రైలర్ లో విక్రమ్ కుమార్ అందించిన హాలీవుడ్ మార్కు విజువల్స్.. ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్.. అదిరిపోయాయ్.
Full View