సౌత్ స్టార్ హీరోగా సూర్య క్రేజు గురించి చెప్పాల్సిన పనే లేదు. కమల్ హాసన్ .. అజిత్ తరహాలోనే ప్రయోగాలు చేయగలిగే సత్తా ఉన్న హీరో. ప్రపంచవ్యాప్తంగా సూర్యకు అసాధారణ ఫాలోయింగ్ ఉంది. అతడు నటించిన తాజా చిత్రం `ఆకాశం నీ హద్దు రా`. ఇది ఈ వేసవిలో విడుదల కావాల్సి ఉన్నా..లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం OTT ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నారని ఇటీవల కొంతకాలంగా కథనాలొస్తున్నాయి. కానీ దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ వార్తా రాలేదు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అక్టోబర్ 30 న ఒటిటి ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఆ మేరకు సూర్య స్వయంగా ట్వీట్ చేశారు. ఇది నిజంగానే అభిమానులకు ఉల్లాసకరమైన వార్త. బాలీవుడ్ మాలీవుడ్ తరహాలోనే తమిళ హీరోలు కూడా తమ చిత్రాల్ని ఓటీటీ వేదికలపై విడుదల చేసేందుకు వెనుకాడటం లేదని అర్థమవుతోంది.
ఆకాశం నీ హద్దురా ట్రైలర్ కి చక్కని స్పందన వచ్చింది కాబట్టి ఓటీటీలో జోరు చూపిస్తుందనే భావిస్తున్నారు. మోహన్ బాబు ఇందులో ఓ కీలక పాత్రలో నటించారు. సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటికి వస్తాయి. కోవిడ్ మహమ్మారీ అన్నిటినీ మార్చేసింది. ఇక వైరస్ నుంచి ప్రజల్ని కాపాడాల్సిందిగా.. గవర్నమెంట్ కి.. సినీ కార్మికులకు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు సూర్య.