సాహో కోసం తగ్గుతున్న సూర్య ?

Update: 2019-08-03 08:02 GMT
ఒక భారీ సినిమా విడుదల వాయిదా పడటం లేదా తేదీ మారడం ఇతర నిర్మాతల ప్లానింగ్ ను ఎంతగా ప్రభావితం చేస్తుందో సాహో విషయంలో ఋజువవుతోంది. ముందు ఆగస్ట్ 15 ప్రకటించినప్పుడు అది వదిలేసి మిగిలిన డేట్స్ షెడ్యూల్ చేసుకున్నారు ఇతర సినిమాల నిర్మాతలు. కానీ కొద్దిరోజులు అయ్యాక దాన్ని మార్చేసి ఆగస్ట్ 30 ఫిక్స్ చేయడంతో సాహో వద్దనుకున్న ఇన్డిపెండెన్స్ డే ని రణరంగం-ఎవరు జాయింట్ గా లాక్ చేసుకున్నాయి. ఇక ఆగస్ట్ 30ని ముందే అనౌన్స్ చేసుకున్న నాని గ్యాంగ్ లీడర్ ఇప్పుడీ పరిణామం వల్లే ఎప్పుడు రావాలో అర్థం కాక సెప్టెంబర్ 13 లేదా 20 అని రెండు ఆప్షన్స్ పెట్టుకుంది.

ఈ పరిణామం వల్ల ఎఫెక్ట్ అయిన మరో సినిమా సూర్య బందోబస్త్. తమిళ్ లో కాప్పన్ గా రూపొందిన ఈ మల్టీ స్టారర్ చాలా నెలల క్రితమే ఆగస్ట్ 15 లాక్ చేసుకుంది. కానీ సాహో ఫిక్స్ కావడంతో ఇది 30కి షిఫ్ట్ అయ్యింది. కట్ చేస్తే నిను వీడని నీడను నేనే తరహాలో సాహో మళ్ళీ 30కి వాయిదా పడటంతో సహనం కోల్పోయిన లైకా సంస్థ అదే రోజుకు పోటీ దిగుతారన్న వార్త చెన్నై నుంచి బలంగా వినిపించింది

కానీ తాజా అప్ డేట్ ప్రకారం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు పలువురు అభిమానులతో జరిపిన చర్చల అనంతం బందోబస్త్ ని సాహోకు పోటీగా దింపడం అంత సేఫ్ కాదనే అభిప్రాయానికి వచ్చి సెప్టెంబర్ 20 కి షిఫ్ట్ చేసే ఆలోచనలో పడ్డారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే సాహు వల్ల రెండుసార్లు ఎఫెక్ట్ అయిన బందోబస్త్ కూడా భారీ సినిమానే. సూర్యతో పాటు మోహన్ లాల్ - ఆర్య - సాయేషా సైగల్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఆడియో సింగల్ కూడా ఇటీవలే విడుదల చేశారు. రంగంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న కెవి ఆనంద్ దీనికి దర్శకుడు కావడం  మరో ఆకర్షణ.


Tags:    

Similar News