ఆ హీరో - డైరెక్టర్లకు ఈ విషయాలు ముందే తెలుసా..?

Update: 2020-05-28 17:00 GMT
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ రేంజ్ లో వణికిస్తుందో అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి ప్రభావం తగ్గకముందే మనదేశంలోని కొన్ని రాష్టాలలో మిడతల దాడి వెలుగులోకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం పరిస్థితులన్ని స్టార్ హీరో సూర్య సినిమాల్లో జరిగినట్టే జరుగుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి తన పంజా విసురుతుంది. మన దగ్గర పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రజలంతా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. 2011లో హీరో సూర్య - మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సెవంత్ సెన్స్'. ఈ సినిమాలో కూడా ఒక వైరాస్ భారత దేశాన్ని గడగడలాడిస్తుందని చూపించారు. చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆ వైరస్ ఒక కుక్క ద్వారా ప్రజలందరికి వ్యాపింప చేస్తాడు. దానికి హీరో విరుగుడు కనిపెడతాడు. ఇప్పుడు కరోనా వైరస్ కూడా అలానే ప్రబలుతోంది.

కానీ మందు కనిపెట్టే హీరోలే కరువయ్యారు. అలాగే ప్రస్తుతం భారత్ లోని కొన్ని రాష్ట్రాలను భయపెడుతోన్న మిడతల దండు. పాకిస్థాన్ దేశం నుండి మిడతల దండు మనదేశంలోని కొన్ని రాష్ట్రాలపై దాడి చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. మనదేశాన్ని దెబ్బ తీసేందుకు పాక్ ఈ మిడతల దండును మన పై వదిలిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవలే సూర్య నటించిన బందోబస్త్ సినిమాలో కూడా మిడత దండు గురించి ప్రస్తావించారు. అవి ఎలా పంటలపై దాడి చేస్తాయి . వాటివల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది సినిమాలో చూపించారు. ఇలా సూర్య నటించిన రెండు సినిమాల్లో రెండు వివత్తుల గురించి ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో సూర్య సినిమాలు ముందే చెప్పాయని అంటున్నారు. కొంపదీసి హీరో సూర్యకి లేదా డైరెక్టర్లు మురగదాస్, కెవి ఆనంద్ లకు ఈ ప్రమాదాల గురించి ముందే తెలుసా.. అని ట్రోల్ చేస్తున్నారు.
Tags:    

Similar News