తమిళనాట తారలే రాజకీయ యవనికపై రాణిస్తుంటారు. ఓ ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు తమిళ రాజకీయాలను ఎన్నో ఏళ్లు శాసించారు. ఇప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. ఈ కోవలోనే మరో స్టార్ హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తాడా? ఆయనకు ఇంట్రస్ట్ ఉందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ఇప్పుడు రాజకీయాల్లో సినీ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే హీరో విజయ్ తాను రాజకీయాల్లోకి రానని అంటే.. ఆయన తండ్రి రావాలని చేస్తున్న గొడవ రచ్చ కెక్కింది. ఇప్పుడు మరో ప్రముఖ హీరో సూర్యపై కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
హీరో సూర్య ఇప్పటికే తమిళనాటు సమాజ సేవ చేస్తూ.. ట్రస్టులు నడిపిస్తూ ప్రజల్లో మంచి పేరు, పాపులారిటీ సంపాదించాడు.ఎంతో మందికి సాయం చేశారాయన.. అందుకే ఆయన రాజకీయాల్లోకి రావాలని కొందరు డిమాండ్ లేవనెత్తారు.
తాజాగా ఇదే ప్రశ్న హీరో సూర్యకు ఒక ఇంటర్వ్యూలో ఎదురైంది. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు’ అనే ప్రశ్నకు హీరో సూర్య స్పందించాడు. ‘నా మెదడులో ఉండే ఆలోచలన్నీ నా మనసులోంచి వచ్చేవే. నిజం చెప్పాలంటే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు’ అంటూ సున్నితంగా తిరస్కరించారు.
దీంతో హీరో సూర్య పొలిటికల్ ఎంట్రీ వార్తలకు చెక్ పడింది. ప్రస్తుతం సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమాలో నటిస్తున్నారు.