2003లో వచ్చిన శివపుత్రుడు ఒక సెన్సేషన్. దర్శకుడు బాలాలో ఎంత ప్రత్యేకత ఉందొ దాని తర్వాతే టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసింది. ఇక హీరోలుగా నటించిన విక్రం సూర్యలకు వచ్చిన పేరు గురించి విడిగా చెప్పనక్కర్లేదు. ఆ ఇద్దరిలో ఒరిజినల్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన మూవీగా అభిమానులు దీన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత సూర్య చాలా కారణాల వల్ల బాలాతో ఇంకో సినిమా చేయలేకపోయాడు. అయినా ఆయనంటే సూర్యకు చాలా అభిమానం.
విశాల్ ఆర్యలతో బాలా తీసిన వాడు వీడులో చిన్న క్యామియో చేసేందుకు వెనుకాడలేదు. ఇన్నేళ్ళ తర్వాత సూర్య బాలాలు మరోసారి కాంబోగా రాబోతున్నట్టు చెన్నై టాక్. ఇప్పటికే స్టొరీ లైన్ ఓకే అయ్యిందని ఫైనల్ వెర్షన్ రెడీ చేశాక నిర్ణయం తీసుకునే విధంగా ఇద్దరూ మాట్లాడుకున్నారట
నిజానికి సూర్యకు బాలాతో స్నేహానికి మించిన బంధం ఉంది. ఇటీవల అర్జున్ రెడ్డి రీమేక్ వర్మను ఫైనల్ కాపీ వచ్చాక సినిమా చెత్తగా ఉందంటూ నిర్మాతలు వేరే కొత్త డైరెక్టర్ తో రీ షూట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇది బాలాను అవమానించడం కిందకే వస్తుంది. అయినా బాలా లైట్ తీసుకుని కొత్త సినిమా పనుల్లో పడిపోయాడు.
ఇది ఓకే అయితే సూర్యకు బాలాతో మూడో సినిమా అవుతుంది. శివపుత్రుడు కన్నా ముందు నంద అనే మూవీ వచ్చింది. సో హ్యాట్రిక్ గ్యారెంటీ అనే అంచనాలు అభిమానులు పెంచుకోవడం సహజం.ఎన్జికేతో పాటు చేస్తున్న కాప్పన్ విడుదలయ్యాక సూర్య దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చు