సూర్య సినిమా అరుదైన ఫీట్

Update: 2019-05-26 07:05 GMT
ఇక్కడ తెలుగులో అసలు విడుదలవుతున్న సందడి లేదు కానీ తమిళ్ లో సూర్య కొత్త సినిమా ఎన్జికె (నంద గోపాల కుమార)మీద మాములు క్రేజ్ లేదు. ఇప్పటికే ఈ హీరో కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ గా దీన్ని ప్లాన్ చేసిన వైనం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్య పోతున్నారు. వరల్డ్ కప్ ని అతి దగ్గర్లో ఉంచుకుని ఇంత పెద్ద సినిమాని రిలీజ్ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతున్నప్పటికీ కంటెంట్ మీద దర్శక నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇప్పుడు దీనికి మరో ఘనత తోడయ్యింది. సౌత్ కొరియాలో విడుదల అవుతున్న మొట్టమొదటి తమిళ సినిమాగా ఎన్జికె కొత్త రికార్డు సొంతం చేసుకుంది. ఓ కమర్షియల్ సినిమా ఇలాంటి రిలీక్ దక్కించుకోవడం చిన్న విషయం కాదు. ఇది విన్న సూర్య ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఎన్జికె పొలిటికల్ థ్రిల్లర్. ఓ యువకుడు సమకాలీన రాజకీయాలలోకి అడుగు పెట్టి వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చేసే ప్రయాణమే ఈ సినిమా.

సాయి పల్లవి సూర్య భార్యగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ సూర్యను గైడ్ చేసే మరో కీలక పాత్ర చేస్తోంది. కంటెంట్ లో చాలా సెన్సేషన్ ఉందని ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ ఊరిస్తోంది. ఇదిలా ఉంటె తెలుగు ప్రమోషన్లను గాలికి వదిలేసిన టీమ్ విడుదలకు రెండు రోజుల ముందు 28న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తోంది. కాస్త ముందే మేల్కొని సౌండ్ చేసి ఉంటే ఓపెనింగ్స్ ఇంకా బాగా హెల్ప్ అయ్యేది
Tags:    

Similar News