సూర్యాకే ఎందుకిలా జరుగుతుంది?

Update: 2018-01-06 11:43 GMT
సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్యే విపరీతమైన పోటీ ఉన్నా ధైర్యం చేసి మరీ డబ్బింగ్ సినిమా గ్యాంగ్ తో వస్తున్నాడు సూర్య. కీర్తి సురేష్ హీరొయిన్ గా నటించిన ఈ మూవీ జై సింహతో పాటు  12న విడుదల కానుంది.తమ్ముడు కార్తిలాగా తెలుగు వెర్షన్ కు తనే డబ్బింగ్ చెప్పుకున్న సూర్య ఈసారి రిజల్ట్ మీద గట్టి నమ్మకంతో ఉన్నాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు అజ్ఞానవాసి అనడంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి సూర్య తప్పేమీ లేదు. తెలుగు వచ్చిందే అంతంత మాత్రం. గ్యాంగ్ డబ్బింగ్ కోసం వారం రోజులు కష్టపడ్డాడు. తమిళ్ లో తను నటించే ఏ సినిమాకైనా డబ్బింగ్ కోసం సూర్య తీసుకునేది రెండు గంటలు మాత్రమే. బాషా సమస్య కాబట్టి అజ్ఞాత అని పలకడంలో నాలుక ఇబ్బంది పడటంతో స్లిప్ అయ్యి అజ్ఞాన అనడం వార్తగా మారింది.

ఇక తమిళ్ లో సైతం ఈ సినిమాకి పరిస్థితి అనుకూలంగా లేదు. పొంగల్ అక్కడ కూడా కీలకమైన పండగ కనక విపరీతమైన పోటీ ఉంది. క్రేజ్ పరంగా సూర్య సినిమాకే వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ హింది సినిమా స్పెషల్ చబ్బీస్ రీమేక్ కావడమే కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది. సినిమా కథేంటి అని ముందే తెలిసిపోయింది కాబట్టి హిందీ సినిమాలు చూసే అలవాటున్న మూవీ లవర్స్ కు ఇదేమంత ఎగ్ జైటింగ్ గా లేదు. ఇక ఇందులో సోడక్కు అనే పాటలో ఉన్న లిరిక్స్ గురించి అక్కడి అధికార పార్టీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ వ్యవస్థను ఎగతాళి చేసేలా ఉందని, ఆ పాటను తొలగించాలని చిన్నపాటి ఉద్యమమే చేస్తున్నారు. రెండు బాషలలో విపరీతమైన పోటీని ఎలా ఫేస్ చేయాలా అని టెన్షన్ లో ఉన్న సూర్యకి ఈ అదనపు తలనొప్పులు వచ్చి చేరాయి.
Tags:    

Similar News