సాయి పల్లవిని మాములుగా మోయలేదే

Update: 2019-05-01 07:20 GMT
కథ నచ్చి పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోని సాయి పల్లవి సూర్యతో మొదటిసారి నటించిన ఎన్జికె మీద అన్ని భాషల్లోనూ ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. మొన్న విడుదల చేసిన ట్రైలర్ లో దీని బ్యాక్ డ్రాప్ పొలిటికల్ థ్రిల్లర్ అని స్పష్టం చేయడంతో అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో హీరో సూర్య సాయి పల్లవిని మాములు పొగడ్తలతో సరిపెట్టలేదు.

ఇంత కన్నా ఏం కావాలి అనే రేంజ్ లో ముంచెత్తాడు. నటించే ప్రతి సీన్ లో పర్ఫెక్ట్ గా రావాలని కోరుకునే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ సాయి పల్లవని ఒకవేళ అలా రాకపోతే ఏడ్చే నటిని కూడా తనలోనే చూశానని చెప్పి అందరిన్ని ఆశ్చర్యపరిచాడు. ఇంత ప్యాషన్ అరుదుగా కనిపిస్తుందని అందుకే తనతో నటించడం పట్ల ఆనందాన్ని సూర్య మాములుగా వ్యక్తం చేయలేదు

ఇందులో మరో హీరొయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తావన తెచ్చినప్పటికి సూర్య మాత్రం ఎక్కువగా సాయి పల్లవి గురించే చెప్పడం గమనార్హం. కథ పరంగా కూడా తనకే ఎక్కువ స్కోప్ ఉండటం కారణం కావొచ్చు. మే 31న విడుదల కానున్న ఎన్జికెలో సాయి పల్లవి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రత్యేకంగా చెబుతున్నాడు అంటేనే ఎంత డెప్త్ ఉందో అర్థమవుతోంది.

మే 31న విడుదల కానున్న ఎన్జికె మీద సాయి పల్లవికి సైతం గట్టి గురే ఉంది. పడి పడి లేచే మనసు ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా తన పాత్ర వరకు మార్కులు కొట్టేసిన సాయి పల్లవికి ఎన్జికె పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు
Tags:    

Similar News