సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో దేశం మొత్తం ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దర్యాప్తులో మొదటి నుంచి రియా చుట్టూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాన నిందితురాలిగా వున్న రియాని సీబీఐతో పాటు నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా విచారించారు. దీనికి ముందు ఈడీ కూడా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ఈ మూడు సంస్థల విచారణలో రియా నుంచి పలు సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దీనికి తోడు సుశాంత్ కు సంబంధించిన 15 కోట్ల రూపాయల్ని రియా తన అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేయించుకుందని సుశాంత్ తండ్రి కెకె సింగ్ ఆరోపించడంతో రంగంలోకి దిగిన ఈడీ ఆమెని కష్టడీలోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో పలు కీలక ఆధారాలు రాబట్టిన ఈడీ త్వరలో రియా.. ఆమె ఫ్యామిలీపై యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
జాతీయ మీడియాలో దీనిపై పలు ఆసక్తికర కథనాలు మొదలయ్యాయి. ఈడీ రియాతో పాటు ఆమె ఫ్యామిలీపై సీరియస్ యాక్షన్ తీసుకోబోతోందని తెలుస్తోంది. రియా ఫ్యామిలీకి సుశాంత్ ఆత్మ హత్యకు లింకు వుందని భావిస్తోంది. ఆ కారణంగానే రియా ఫ్యామిలీపై సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇల్లీగల్ డ్రగ్ దందా విషయంలో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ ని కూడా నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో లోతుగా విచారణ చేసింది. ఈ విచారణలో రియా 25 మంది సెలబ్రిటీల పేర్లని బయట పెట్టారని జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఇదిలా వుంటే ఈ బుధవారం సుశాంత్ మాజీ మేనేజర్ శృతిమోదీతో పాటు జయ సాహాలని నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో విచారించబోతోంది. దీంతో రియాకు సంబంధించిన పలు కీలక అంశాలు బయటికి వచ్చే అవకాశం వుందని భావిస్తున్నారు.