గేమ్ చేంజర్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
ఇక ఓవర్సీస్ బుకింగ్స్‌తో కలిపి, వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల రేంజ్‌లో గ్రాస్ బుకింగ్స్ జరగడంతో సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం కనిపిస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘గేమ్ చేంజర్’ విడుదలకు రంగం సిద్ధమైంది. వరల్డ్ వైడ్ గా జనవరి 10న సినిమా తెలుగు హిందీ తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదట్లో కాస్త అంచనాలు తక్కువగానే ఉన్నా కూడా రిలీజ్ సమయానికి ఒక్కసారిగా నమ్మకం పెరిగిపోయింది. ట్రైలర్, పాటలు ప్రేక్షకులను మరింత ఆకర్షించాయి.
అయితే, బిగ్ పాన్ ఇండియా మూవీస్‌తో పోల్చితే, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా లేట్‌గానే ప్రారంభమయ్యాయి, అందుకే బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ లేటుగా ప్రారంభమైనప్పటికీ, టికెట్ హైక్‌లు బాగా హెల్ప్ చేశాయి. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం మొదలైంది.
నైజాంలో మాత్రం ప్రారంభ దశలో కొంచెం మందగమనమే కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల గ్రాస్ బుకింగ్స్ ఇప్పటికే పూర్తయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చే రియాక్షన్ బట్టి సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఓవర్సీస్‌లో బుకింగ్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా, దేశీయంగా మాత్రం సాలిడ్ బుకింగ్స్ ను సాధించింది.
హిందీ వెర్షన్‌లో సాధారణ స్పందన ఉన్నప్పటికీ, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల్లో మంచి పికప్ కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియా మొత్తం మీద తెలుగు వెర్షన్‌కి దాదాపు 17 కోట్ల గ్రాస్ బుకింగ్స్ జరగగా, ఇతర వెర్షన్‌లతో కలిపి 22 కోట్లకు పైగా గ్రాస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్ బుకింగ్స్‌తో కలిపి, వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల రేంజ్‌లో గ్రాస్ బుకింగ్స్ జరగడంతో సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం కనిపిస్తోంది.
బుకింగ్స్ లేట్‌గా ప్రారంభమైనా, రామ్ చరణ్ స్టార్ పవర్, శంకర్ దర్శకత్వ ప్రతిభ సినిమాకు ప్లస్ అవుతాయని ట్రేడ్ అనలిస్టులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు వరకు ఉండే ట్రెండ్‌ను బట్టి, ప్రేక్షకుల స్పందనను గమనించి, సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమని భావిస్తున్నారు.
రామ్ చరణ్ కెరీర్‌లో మరో సాలిడ్ ఓపెనింగ్ ఇచ్చే సినిమాగా ‘గేమ్ చేంజర్’ నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశతో ఎదురుచూస్తున్నారు. అంతేకాక, ఈ సినిమా విడుదలై పాజిటివ్ మౌత్ టాక్ సంపాదిస్తే, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ‘గేమ్ చేంజర్’ బుకింగ్స్ టాలీవుడ్‌లో మరో కొత్త చరిత్ర సృష్టించనున్నాయని చెప్పుకోవచ్చు.