ప్రేమికుల దాగుడు మూతలాటను కనిపెట్టేయడం చాలా ఈజీ. కేవలం స్నేహితులం మాత్రమేనని తప్పించుకోజూసినా వాలకం చూసి పట్టేయొచ్చు. ఆ వ్యవహారం కాస్తా బయటికి తెలిసిపోయినా ఇంకా ఇంకా దాచాలని చూసి అడ్డంగా దొరికిపోయే లవర్స్ కూడా ఎక్కువే. ఆనక దొరికిపోయాక అబ్బే అలాంటిదేం లేదు! అంటూ నాలుక్కరుచుకుంటారు. ఇదిగో ఇక్కడ దొరికిపోయింది ఆ బాపతు ప్రేమికులే.
గత కొంతకాలంగా ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు చెట్టాపట్టాల్ అంటూ తిరిగేస్తున్నారని బాలీవుడ్ లో తామరతంపరగా కథనాలు పుట్టుకొస్తున్నాయి. అయినా.. అబ్బే అలాంటిదేం లేదు మేం కేవలం స్నేహితులం మాత్రమేనని కలరింగ్ ఇస్తున్నారు సుశాంత్ సింగ్- రియా చక్రవర్తి జోడీ. అప్పట్లో సుశాంత్ సింగ్ ఇంట్లోంచి పిల్లిలా చడీ చప్పుడు లేకుండా జారుకుంటూ గేటు వెలుపల మీడియాకి చిక్కిన రియా తర్వాత కవరింగ్ కోసం చాలానే ట్రై చేసింది. కానీ మీడియా అస్సలు నమ్మకుండా ఆ ఇద్దరి మధ్యా ఎఫైర్ గురించి కథలు కథలుగా ప్రచారం చేసింది.
ప్రస్తుతం మరోసారి అదే తీరుగా మీడియా కంటికి చిక్కింది ఈ జోడీ. ఆయన గారు ఎక్కడుంటే అక్కడే వాలిపోతోంది రియా. ఆయనగారు ఏం చేస్తే అదే చేస్తోంది. తాజాగా లడక్ ట్రిప్ లోనూ అలానే చేసింది. అందుకు ప్రూఫ్ దొరకేయడంతో ఇంకేం ఉంది .. బాలీవుడ్ మీడియాకి మరోసారి మసాలా ఐటెమ్ దొరికేసింది. ఇదిగో లవర్స్ దొరికిపోయారు! అంటూ ఒకటే ఊదరగొట్టేస్తోంది మీడియా. ఆ ఇద్దరూ ఒకేసారి మంచు కొండల్లోని లడక్ లో ఎంటర్ టైన్ అవుతూ కనిపించారు. అయితే ఇద్దరం కలిసి వెళ్లలేదు అని కలరింగ్ ఇస్తూ వేర్వేరు ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలా దాచాలని చూసినా కామన్ గా ఆ ఇద్దరూ చేసిన ఓ తప్పు వల్ల అడ్డంగా చిక్కారు. ఆ ఇద్దరూ వేర్వేరు ఫోటోలు షేర్ చేసినా అందులో కామన్ గా ఓ చిన్నారి బుడతడు దర్శనమిచ్చాడు. వాడితో సరదాగా టైమ్ పాస్ చేస్తున్న ఆ ఫోటోలు చూస్తే ఇద్దరూ కలిసి ఒకేచోట ఎంజాయ్ చేస్తున్నారని అర్థమవుతోంది. అన్నట్టు లడక్ లో ఈ జంట ఏం చేస్తున్నట్టో? ఇంతకీ కలిసి ఒకే చోట బస చేయడమేంటో! అంటూ ఒకటే యువతరం బుర్రలు పీక్కుంటున్నారు. తూనీగ తూనీగ చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన రియాకపూర్ అటుపై బాలీవుడ్ లో కెరీర్ సాగిస్తున్న సంగతి తెలిసిందే. యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఎఫైర్ నడిపిస్తూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.