బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ సహా అన్ని వుడ్ లు శోకసంద్రమవుతున్నాయి. ఆయన మరణాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇంతటి విపత్కర సమయంలో సుశాంత్ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకున్నది. సుశాంత్ ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. అతడి వదిన, కజిన్ అమరేంద్రసింగ్ భార్య ఆకస్మికంగా మరణించింది. ఇప్పటికే విషాదంలో ఉన్న కుటుంబాన్ని మరింత దు:ఖంలోకి నెట్టింది.
సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణ వార్త విన్నప్పటి నుంచి తన సోదరుడి భార్య సుధాదేవి ఆహార పానీయాలు తీసుకోవడం మానేశారని తెలిసింది. దాంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని అంటున్నారు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధా దేవికి మరిది సుశాంత్ మరణవార్త విన్నప్పటి నుంచి మెడిసన్స్, ఆహారం తీసుకోకుండా ఏడుస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే సుధాదేవి తుదిశ్వాస విడిచారు. తన భార్య మరణంతో అమరేంద్రసింగ్ షాక్ కు గురయ్యారు.
ఇక సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అతడి తండ్రి కూడా అనారోగ్యం పాలయ్యాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోవడం లేదు.