బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హత్య కేసు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తుంది. బలవంతపు ఆత్మహత్య అంటూ కొందరు కాదు ఖచ్చితంగా హత్య అంటూ మరికొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసు సీబీఐ వారికి అప్పగించాల్సిందే అంటూ సుశాంత్ రాజ్ పూత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో సుశాంత్ వద్ద గతంలో ఉద్యోగం చేసిన అంకిత్ ఆచార్య షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈమద్య కాలంలో అంకిత్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇటీవల రియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సుశాంత్ మరణంపై ఉన్న అనుమానాలను మరింతగా పెంచాయి. ఇప్పుడు అతడు ఏకంగా సుశాంత్ ను హత్య చేసి ఉంటారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సుశాంత్ ఇంట్లో ఉండే పెంపుడు కుక్క ఫడ్జ్ కు ఉండే బెల్డ్ తో అతడి గొంతును బిగించి కొట్టి హత్య చేసి ఉంటారు అంటూ అంకిత్ ఆరోపిస్తున్నాడు. అతడి శరీరంపై ఉన్న గాయాలను చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సుశాంత్ వద్ద పని చేసే పలువురిని రియా చక్రవర్తి తొలగించింది. కారణం లేకుండా వారిని తొలగించడంతో పాటు తనకు నమ్మకస్తులు అయిన వారిని ఉద్యోగంలో పెట్టిందని అంకిత్ అంటున్నాడు.
అంకిత్ ఆరోపణల ప్రకారం సుశాంత్ ను పథకం ప్రకారం రియా చక్రవర్తి చంపించిందట. బాలీవుడ్ కు చెందిన కొందరు ఆమెను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రియా చక్రవర్తికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో అంకిత్ ఆచార్య వాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.