పెద్ద సినిమాలైన రజనీకాంత్ కబాలికీ - ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కీ మధ్యలో నాలుగైదు వారాలపాటు గ్యాప్ దొరికింది. దీంతో చిన్న సినిమాలు రెచ్చిపోతున్నాయి. ఒకదాని వెంట మరొకటి రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ చేసేస్తున్నాయి. తాజాగా సుశాంత్ కూడా తన కొత్త సినిమా ఆటాడుకుందాం రా విడుదల తేదీని ఫిక్స్ చేశాడు. ఆగస్టు 19న ఆ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. బాబు బంగారం విడుదలైన వారం రోజులకే సుశాంత్ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందన్నమాట. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆటాడుకుందాం రా. ఎప్పట్నుంచో ఈ చిత్రం సెట్స్‌పై ఉంది. నాగేశ్వరరెడ్డి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా కాస్త ఆలస్యమైంది.
ఇటీవలే మిగిలివున్న రెండు సాంగ్స్‌ని పూర్తవడంతో చిత్రం విడుదలకి ముస్తాబవుతోంది. ఆగస్టు 12న విడుదలవ్వాల్సిన జనతా గ్యారేజ్ తర్వాతే ఆటాడుకుందాం రాని ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనుకొన్నారు. కానీ జనతా గ్యారేజ్ వాయిదా పడటంతో సుశాంత్ సినిమా ముందుకొచ్చింది. అడ్డా తర్వాత సుశాంత్ చేసిన సినిమా ఇదే. కామెడీకి పెద్దపీట వేస్తూ సినిమాలు తీసే నాగేశ్వరరెడ్డి ఇటీవల ఫామ్ లో ఉన్నాడు. అందుకే సుశాంత్ ఈ సినిమాపై చాలా నమ్మకాన్ని పెట్టుకొన్నాడు.