ఈ విపత్తులోనూ చక్కర్లు కొడుతున్న లవ్‌ బర్డ్స్‌

Update: 2020-06-12 11:30 GMT
దేశ వ్యాప్తంగా ఎక్కడికి అక్కడ జన జీవనం స్థంభించిన సమయంలో కొందరు బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ ఆ సమయంను ఫుల్‌ గా ఎంజాయ్‌ చేశారు. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి కొత్త అనుభూతులను అనుభవించారు. బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ప్రస్తుతం ప్రియురాలితో తన ఇంట్లోనే సరదా టైం ను గడిపేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్‌ వర్గాల వారు మీడియాతో షేర్‌ చేసుకుంటున్నారు.

తెలుగులో తూనీగా తూనీగా చిత్రంలో నటించిన రెహా చక్రవర్తి తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. సౌత్‌ లో ఈ అమ్మడికి పెద్దగా వర్కౌట్‌ కాకపోవడంతో బాలీవుడ్‌ వెళ్లింది. అక్కడ మంచి ఆఫర్లతో ఈ బిజీ అయ్యింది. కొన్నాళ్లుగా ఈమె సుశాంత్‌ సింగ్‌ తో ప్రేమాయణం సాగిస్తుంది. ఇద్దరి మద్య వ్యవహారం గురించి రెహా బర్త్‌ డే సందర్బంగా వెలుగులోకి వచ్చింది. లండన్‌ లో చాలా గ్రాండ్‌ గా ఈమె బర్త్‌ డేను నిర్వహించి తన ప్రేమ విషాయన్ని అందరికి తెలిసేలా చేశాడు.

త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం అత్యవసరాలకు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతులు ఇస్తున్నారు. అయినా కూడా ఈ సమయంలో సుశాంత్‌ ఇంట్లో కలుస్తున్నారు. వీరిద్దరు ఈ ఫ్రీ టైం ను ఫుల్‌ గా ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో వీరి పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.
Tags:    

Similar News