మే 27.. జూన్ 3.. జులై 1.. జులై 15.. ఇప్పటిదాకా వినిపించిన ‘కబాలి’ రిలీజ్ డేట్లివి. జులై 15న పక్కా అంటే పక్కా అన్నారు. కానీ ఆ తేదీకి కూడా ‘కబాలి’ విడుదల కాదని తేలిపోయింది. ఈ తేదీన అల్లరి నరేష్ సినిమా ‘సెల్ఫీ రాజా’ రిలీజ్ కన్ఫమ్ చేసుకోవడంతో ‘కబాలి’ వాయిదా పడ్డ సంగతి తేలిపోయింది. మరి ఇంతకీ సూపర్ స్టార్ సినిమా ఎప్పుడు రిలీజవుతుందన్నది అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్న.
తెలుగు-తమిళం-హిందీతో పాటు మలేషియా భాష మలాయ్ లోనూ ‘కబాలి’ని విడుదల చేస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్.. డబ్బింగ్ కార్యక్రమాల విషయంలో బాగా ఆలస్యమవుతోంది. దీంతో కబాలి ఎప్పుడు రెడీ అవుతుందన్నది దర్శక నిర్మాతలే చెప్పలేకపోతున్నారు. ఐతే కుదిరితే జులై 22న లేదంటే 29 పక్కాగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు కలైపులి థాను. కబాలి లేటెస్ట్ పోస్టర్ల మీద డేట్ పేర్కొనకుండా జులై రిలీజ్ అని మాత్రం వేశారు. కాబట్టి ఆ రెండు శుక్రవారాల్లో ఏదో ఒక రోజు ‘కబాలి’ విడుదల ఖాయమని అనుకోవచ్చు.
మరోవైపు విడుదల తేదీ తేలకపోయినా.. కబాలి వరల్డ్ వైడ్ బిజినెస్ పూర్తయింది. కబాలి నార్త్ ఇండియా రైట్స్ ను ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ సొంతం చేసుకుంది. హిందీతో పాటు తమిళ తెలుగు వెర్షన్లనూ నార్త్ ఇండియాలో ఆ సంస్థే విడుదల చేయనుంది. మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ‘కబాలి’ బిజినెస్ పూర్తయింది. మొత్తం రూ.200 కోట్లకు పైనే బిజినెస్ జరిగినట్లు సమాచారం.