స్టార్ హీరో మాజీ భార్య... బికిని 2.0

Update: 2019-05-31 05:06 GMT
హిందీ సినిమా న్యూస్ ఫాలో అయ్యేవసరికి హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.  హృతిక్ రోషన్ తో కొన్నేళ్ళు ప్రేమాయణం నడిపిన ఈ భామ 2000 వ సంవత్సరంలో ఎంతోమంది అమ్మాయిల కలలు చెదిరిపోయేలా హృతిక్ ను పెళ్లి చేసుకుంది.  హృతిక్ - సుజానే జంటకు రెహాన్.. హృదాన్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. అయితే వైవాహిక జీవితంలో విభేధాల కారణంగా హృతిక్ - సుజానే ఇద్దరూ పరస్పర అంగీకారంతో  2014 లో విడాకులు తీసుకున్నారు.  కానీ పిల్లల కోసం మాత్రం ఇద్దరూ కలుస్తూ ఉంటారు.

సుజానే ప్రస్తుతం సింగిల్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది.  ప్రొఫెషనల్ గా సుజానే ఒక ఫ్యాషన్ డిజైనర్.  బాలీవుడ్ లో ఉన్న హైఫై సెలబ్రిటీలు అందరూ పరిచయమే కాబట్టి అందరితో కలిసి సరదాగా గడుపుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా సుజానే యాక్టివ్ గా ఉంటుంది.  తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "హలో వేసవికాలం.. త్వరగా నా దగ్గరకు రా.  సూర్యకిరణాలు అలా నన్ను తాకితే.  ఫ్లాష్ బ్యాక్ సమ్మర్ 2018." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అసలే ఏసీలలో ఉండడం.. చల్లని ప్రదేశాలలో వెకేషన్లకు తిరగడంతో ఆమెకు ప్రస్తుతం ఇండియాలో ఉన్న బండలు పగిలే ఎండాకాలం గురించి పెద్దగా తెలియనట్టుంది. అందుకే నెటిజనులు కూడా ఆమెకు "సమ్మర్ ను రమ్మని కోరడం ఏంటి.. సమ్మర్ పీక్స్ లో ఉంటే" అంటూ గుర్తు చేశారు.

ఫోటోలో బికిని ధరించిన సుజానే చలవ కళ్ళజోడు.. తలపై టోపీ ధరించింది.  ఆ బికినిని కుట్టిన టైలర్ ఎవరో కానీ పరమ పిసినారిగా ఉన్నాడు.  ఎంతో పొదుపుగా వీలైనంత తక్కువ బట్టతో కుట్టడంతో సుజానే అందాలు బైటపడ్డాయి.  దీంతో ఇన్స్టాలో కామెంట్లే కామెంట్లు. "చలి కాలం అనుకొని వేడి పెంచుతున్నావా" అని ఒకరంటే.. "వయసు నలభైలాగా కనిపించడం లేదే" అని మరొకరు అన్నారు.  ఏదైతేనేం గ్రీక్ గాడ్ కు సరైన పోటీ ఇవ్వగల గ్రీక్ దేవత అని మనం ఒప్పుకోవాల్సిందే. హృతిక్ నుండి విడాకులు తీసుకున్నప్పటికీ ఈమధ్య మళ్ళీ కలిసి టూర్లు షికార్లు చేస్తుండడం తో మళ్ళీ పెళ్ళి చేసుకుంటారేమోనని బాలీవుడ్ అమ్మలక్కలు బాంద్రా ఏరియాలో గుసగుసలాడుకుంటున్నారట.
Tags:    

Similar News