అంత మంచోడైతే డైవర్స్ ఎందుకిచ్చావ్??

Update: 2017-09-06 10:18 GMT
ఇప్పుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు.. జనాలకు పెద్దగా రుచించట్లేదు. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడుతుందో ఆ విషయాలన్నీ ఆమె చేసిన రియల్ లైఫ్ పనులకు చాలా విరుద్దంగా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా హృతిక్ గురించి ఆమె చేసిన కామెంట్లు.. ఏదో తన మాజీ భర్తను వెనకేసుకురావాలనే ఉద్దేశ్యంతో చేసినా.. జనాలు మాత్రం ఆమెను నమ్మట్లేదు.

హృతిక్ రోషన్ తనను ముగ్గులోకి దింపి మోసం చేశాడంటూ మరోసారి కంగనా రనౌత్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కామెంట్లపై ఇన్-డైరక్టుగా స్పందించింది సుజానే. తన మాజీ భర్త హృతిక్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''ఒక మంచి మనిషిని డామినేట్ చేసే రేంజులో ఎప్పుడూ ఒక చెడు ఆరోపణ ఉండదు'' అంటూ ఇద్దరూ కలసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. అంటే హృతిక్ అంత మంచోడు.. కంగన ఊరికే ఆరోపణలు చేస్తోందని ఆమె భావమా? అదే అయ్యుండొచ్చు.

దానిపై రియాక్ట్ అయిన నెటిజన్లు.. ''అంత మంచోడైతే మరి డైవర్స్ ఎందుకిచ్చావ్?'' అంటూ కామెంట్లు గుప్పించారు. నిజంగానే హృతిక్ చాలా మంచోడైతే మరి సుజానే విడాకులు ఎందుకు తీసుకున్నట్లు? అంటే మంచితనం ఉన్నా కూడా హ్యాపీగా డైవర్స్ తీసుకునేంత గొప్ప స్థాయిలో వీరి రిలేషన్ ఉందన్నమాట. ఇకపోతే కంగనా రనౌత్ మాత్రం.. హృతిక్ తన వెంటపడ్డాడని.. కైట్స్ సినిమా చేశాక క్రిష్ 3లో అందుకే పెట్టుకున్నాడని.. తన వాదనకు తాను కట్టుబడుతున్నాను అనే చెబుతోంది. అది సంగతి.
Tags:    

Similar News