ఒక సినిమాని ప్రారంభించి అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతే కచ్ఛితంగా కొన్ని అవమానాలు తప్పదు. అలాంటి సన్నివేశాన్ని `సువర్ణ సుందరి` టీమ్ ఎదుర్కొందా? అంటే అవుననే తెలుస్తోంది. సువర్ణ సుందరి అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఈ సినిమాపై ఎన్నో అవమానాలు .. ఎత్తిపొడుపులు తప్పలేదని యూనిట్ సభ్యుల్లో ఒకరు కాస్త ఎమోషన్ అయిన వైనం చర్చకొచ్చింది. నేటి ప్రసాద్ లాబ్స్ మీడియా సమావేశంలో ప్రస్తుత కాంపిటీషన్ లో థియేటర్ల సమస్య గురించి చిత్రయూనిట్ ప్రస్తావించింది. థియేటర్లు తక్కువ ఉన్నా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. కచ్ఛితంగా విజయం సాధించే చిత్రమిదని దర్శకనిర్మాతలు తెలిపారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం ఎంతో శ్రమించామని చెబుతున్న దర్శకుడు సూర్య ఎం.ఎస్.ఎన్ .. దాదాపు 45 నిమిషాల గ్రాఫిక్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని .. వాటిలో క్వాలిటీ కోసమే ఇంత టైమ్ తీసుకున్నామని అన్నారు.
సీనియర్ నటి జయప్రద- పూర్ణ- సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం `సువర్ణసుందరి`. ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్భుతంగా తీర్చిదిద్దామని దర్శకుడు తెలిపారు. ఇందులో పూర్ణ .. సాక్షి రెండు జనరేషన్ల లో కనిపిస్తారని .. ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు ఈగోల్లేకుండా అన్నిరకాలుగా సహకరించారని అన్నారు. ఆసక్తికరంగా జయప్రద .. పూర్ణకు కుమార్తెగా కనిపించనున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో దర్శకనిర్మాతలు సహా సాక్షి చౌదరి- పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్లు శ్రమించారు.. కదా? ఇంతకీ ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి? అంటే.. ఇందులో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఇందులో రోమాలు నిక్కబొడుచుకునేలా ఎగ్జయిట్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు తెలిపారు. క్లైమాక్స్ లో సీతాకోక చిలుకలతో ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందన్నారు. సౌండ్ బేస్డ్ మూవీ ఇది. సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చిదిద్దామని.. ఇది టెక్నీషియన్స్ మూవీ అని తెలిపారు. ఈనెల 31న రిలీజ్ చేస్తున్నాం. థియేటర్లు తక్కువ ఉన్నా రిలీజ్ చేస్తాం. ఇది క్వాలిటీ సినిమా.. విజయం సాధించే సినిమా అని అన్నారు. ఈ సినిమాలో సాక్షి చౌదరి ఫైటింగ్ సీన్ ని డ్యాన్స్ కలగలిపి తీర్చిదిద్దిన ఫైట్ సీన్ హైలైట్ గా ఉంటాయని నటి పూర్ణ తెలిపారు. ఇకపోతే ఇదివరకూ రిలీజైన సువర్ణ సుందరి ట్రైలర్ గ్రాఫిక్స్ పరంగా ఆశించిన క్వాలిటీ లేదని టాక్ వచ్చింది. పైగా ఇప్పుడు నాలుగైదు సినిమాలతో పోటీ పడి రిలీజ్ చేస్తుండడంతో థియేటర్లు ఎంతవరకూ దక్కుతాయి? అన్నది వేచి చూడాల్సిందే.