చూసే కళ్లను బట్టి ప్రతిదీ మారిపోతుంది. ఆధునిక యుగంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో జనరేషన్ లో ఒకే దృశ్యాన్ని ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. రణవీర్ సింగ్ కంటే ముందు చాలామంది స్టార్లు నగ్నంగా కనిపించారు. చాలా ఏళ్ల క్రితం నగ్న ఫోటోషూట్లతో దుమారం రేపిన స్టార్లు ఎందరో ఉన్నారు. అంతెందుకు ఒక తెలుగు సినిమాలో ప్రకాష్ రాజ్ లాంటి స్టార్ నగ్నంగా కనిపించి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ఇలాంటివి చేసినప్పుడే తమను విలక్షణ నటుడు అని లేదా డ్యాషింగ్ స్టార్ అని కూడా అంటారు. ఇలాంటి ప్రయోగాలతోనే రణవీర్ అనే ఒక స్టార్ ఉన్నాడని ఖాన్ ల ఇలాకా అయిన బాలీవుడ్ లో చెప్పుకోవడం సాధ్యమైంది.
అయితే రణవీర్ సింగ్ నైతికతను మరిచి ఇలా నగ్న ఫోటోషూట్ చేశాడని చాలామంది నెటిజనులు ఇష్టానుసారం విమర్శిస్తున్నారు. ఈ ఫోటోషూట్ కి ప్రశంసలతో పాటు ఇబ్బడిముబ్బడిగా విమర్శలు ఎదురయ్యాయి. అయితే అన్నిటినీ సమానంగా స్వీకరించడమే హీరోయిజం అని నిరూపిస్తున్నాడు రణవీర్. అతడికి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి బోలెడంత మద్ధతు లభిస్తోంది. తాజాగా రణవీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ `నైతిక సమస్య కాదు` అని సీనియర్ నటి స్వరా భాస్కర్ వ్యాఖ్యానించారు. మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు! అని కూడా స్వరా అన్నారు.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ లో `వీరే ది వెడ్డింగ్` ఫేం స్వరా భాస్కర్ సూటిగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రణ్ వీర్ నగ్న చిత్రాలు నైతిక సమస్య కాదని ప్రజలు తమ ప్రాధాన్యతలను ఇతరులపై రుద్దకూడదని వ్యాఖ్యానించారు. ``భారతదేశంలో రోజువారీ అన్యాయాలు అణచివేత కేసులు పెరుగుతున్నాయి. మన ఆగ్రహం అంతా రణవీర్ ఫోటోషూట్ పైనేనా! నా ఉద్దేశ్యంలో అలాంటివి చూడటం ఇష్టం లేదంటే చూడవద్దు! అయినా అది మీ పని కాదు(ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ కాఫీ! మాపై మీ ప్రాధాన్యతలను ఉద్ధేశాలను రుద్దొద్దు! నిజానికి ఆ ఫోటోషూట్ నైతిక సమస్య కాదు! `` అని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు బెంగాలీ నటిగా మారిన రాజకీయ నాయకురాలు మిమీ చక్రవర్తి కూడా రణవీర్ నగ్న చిత్రాల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇదే నగ్న ఫోటోషూట్ స్త్రీలు చేస్తే ..!
ఇతరుల మాదిరిగానే బెంగాలీ నటి కం రాజకీయ నాయకురాలు మిమీ చక్రవర్తి ట్విట్టర్ లో రణవీర్ నగ్న ఫోటోషూట్ గురించి తాను ఏమనుకుంటుందో వెల్లడించింది. రణవీర్ చేసిన పనిని ప్రశంసిస్తూనే.. లింగ విభేధం- సమానత్వ సమస్య గురించి ఆమె సూటిగా ప్రశ్నించారు. తన ట్వీట్లలో ఇలాంటి ఫోటోషూట్ లో పాల్గొంటే ఎవరైనా ఒక స్త్రీకి కూడా అదే స్పందన లభిస్తుందా? అంటూ మిమీ ప్రశ్నించింది. ``రణ్ వీర్ సింగ్ తాజా ఫోటోషూట్ తో ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. వ్యాఖ్యలు (ఫైర్ ఎమోజీలు) హుషారుగా ఉన్నాయి. ఇలా చేసినది ఒక స్త్రీ అయితే ప్రశంసలు ఇలాగే ఉండేవా?`` అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
మీరు ఇంటిని తగులబెట్టి తనను చంపేస్తామని బెదిరించి.. వ్యభిచారి అంటూ అవమానించారా? అని ఒక ట్వీట్ లో ప్రశ్నించారు. ``మేము సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అది ఎక్కడ ఉంది ?! మీకు బాగా తెలుసు.. మీ దృక్పథం దేనినైనా మార్చగలదు లేదా పూర్తిగా నాశనం చేయగలదు. రణవీర్ విషయంలో మన ధృక్పథాన్ని విస్తృతం చేద్దాం. ఎందుకంటే అలాంటి శరీరం (లుక్) చాలా త్యాగం చేస్తేనే వస్తుంది. నన్ను నమ్మండి.. ఉప్పు .. చక్కెర .. పిండి పదార్థాలు లేవు.. కానీ అలాంటివి మాత్రమే తిని కష్టపడాలి`` అని అన్నారు మిమీ.
1972లో మ్యాగజైన్ షూటింగ్ లో నగ్నంగా కనిపించిన 70ల పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్ కు రణవీర్ నివాళి అర్పిస్తూ నగ్న ఫోటోషూట్ లో కనిపించగా ఇది పెద్ద డిబేట్ కి తెర తీసింది. ఇది ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం రోహిత్ శెట్టి సర్కస్ విడుదల కోసం రణవీర్ ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది. రణవీర్ సరసన పూజా హెగ్డే- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో కథానాయికలుగా నటించారు.