తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లో అడుగు పెట్టిన స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించి నిన్నటి ఎపిసోడ్ ను ముగించేశాడు. అనూహ్యంగా మొదటి వారంలోనే ఆమె ఎలిమినేట్ అవ్వడం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆమెకు ఓట్లు తక్కువ వచ్చి ఉంటాయి అనుకున్నారు. కాని ఆమె గ్లామర్ హౌస్ కు అవసరం ఉంటుంది కనుక ఒకటి రెండు వారాలు అయినా నిర్వాహకులు ఉంచుతారేమో అంటూ ప్రేక్షకులు అనుకున్నారు. కాని అనూహ్యంగా స్వాతి గన్ పేలింది. ఆమె గన్ షాట్ కు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇదంతా ఫేక్ ఎలిమినేషన్ అయ్యి ఉంటుందని ప్రేక్షకులు ఇంకా ఊహల్లో ఉన్నారు. నేటి ఎపిసోడ్ లో ఏదో జరుగబోతుంది అంటూ ఎదురు చూస్తున్నారు.
అప్పుడప్పుడు ఫేక్ ఎలిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంతకు ముందు వారం హారిక విషయంలో ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. కనుక మళ్లీ మళ్లీ అదే డ్రామాను ఆడే అవకాశం లేదు. ఈసారికి స్వాతిది రియల్ ఎలిమినేషన్ అయ్యి ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో బలంగా నమ్ముతూ కామెంట్స్ చేస్తున్నారు. ఏం జరగబోతుంది అనే విషయాన్ని నేటి ఎపిసోడ్ లో చూసి ప్రేక్షకులు తెలుసుకోవాల్సిందే. స్వాతి ఎలిమినేషన్ పక్రియ అయిన తర్వాత కూడా ఇంకా బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు అంటూ ప్రోమో వేశారు. అంటే మరొకరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయినా అయ్యి ఉండాలి లేదంటే స్వాతి ఎలిమినేషన్ ఫేక్ అయ్యి అయినా ఉండాలి.
ఈ రెండింటిలో ఏం జరిగినా కూడా ప్రేక్షకులు థ్రిల్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్. షో కు ప్రేక్షకులను కట్టి పడే ఉద్దేశ్యంతో నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి ట్విస్ట్ లు ఇస్తున్నారు. నాలుగు వారాలు పూర్తి అయిన బిగ్ బాస్ హౌస్ నుండి ఒకటి లేదా రెండు వారాలు తప్పనిసరిగా డబుల్ ఎలిమినేషన్ తప్పదు. అందుకే ఈ వారం ఆ డబుల్ ఎలిమినేషన్ అయ్యి ఉంటుంది అంటున్నారు. మరి ఆ రెండవ వికెట్ ఎవరు అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో స్వాతి బయటకు వెళ్లే సమయంలో నోయల్ కంట తడి పెట్టడం రకరకాల ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది నేటి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.