కలర్స్ పాపకు నారా బాబు ఛాన్స్

Update: 2015-07-21 09:16 GMT
నారా రోహిత్ స్పీడు చూసి మిగతా హీరోలకు దిమ్మదిరిగిపోతోంది. ఒక సినిమా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకోటి పూర్తయ్యే దశలో ఉంది. కొత్తగా మూడు సినిమాలు మొదలయ్యాయి. టాలీవుడ్ లో యమ స్పీడుతో సినిమాలు చేస్తాడని పేరున్న అల్లరి నరేష్ కూడా రోహిత్ జోరు చూసి ఆశ్చర్యపోయేలా ఉంది పరిస్థితి. ఐతే హీరోగా ఇంత బిజీగా ఉంటూ కూడా నిర్మాణంలోనూ ఓ చేయి వేస్తుండటం విశేషం. ఇంతకుముందు ‘అసుర’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన రోహిత్.. ఇప్పుడు తన నిర్మాణంలో వేరే హీరో హీరోయిన్లతో సినిమా తీస్తుండటం విశేషం.

ఈ చిత్రంలో రోహిత్ క్లోజ్ ఫ్రెండ్ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. కలర్స్ స్వాతి హీరోయిన్ గా చేస్తోంది. వేణు ఉడుగుల అనే కొత్త దర్శకుడిని ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు రోహిత్. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ యువన్ సంగీత సారథ్యం వహించనున్నాడు. త్వరలోనే  ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లనుంది. రోహిత్ ఇంతకుముందు మిత్రులతో కలిసి నల దమయంతి అనే సినిమా మొదలుపెట్టాడు. అందులోనూ శ్రీవిష్ణునే హీరో. ఐతే ఆ సినిమా ఏ దశలో ఉందన్నదానిపై అప్ డేట్స్ లేవు. ఐతే ఇప్పుడు శ్రీ విష్ణు, స్వాతి హీరోయిన్లుగా మొదలవుతున్న సినిమాకు హోల్ అండ్ సోల్ తనే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు రోహిత్.
Tags:    

Similar News