త్రిపురగా భయపెట్టబోతోంది కలర్స్ స్వాతి. సైన్స్ కి - మానవాతీత శక్తులకు మధ్య ఎప్పడూ పోటీ ఉంటుంది. రెండు వైపులా ప్రశ్నలు మిగిలిపోతాయి. తాను అనుకున్నవన్నీ జరిగిపోతున్న సంతోషంలో ఉండే అమ్మాయి కథే త్రిపుర. కానీ ఏది నిజం, ఏది భ్రమ అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఉండదు. ఇలాంటి రోల్ చేయడం స్వాతికి ఇదే మొదటిసారి. ట్రైలర్ లోనే భయంకరమైన రూపం చూపించి భయపెట్టే ప్రయత్నం చేసింది.
అల్లరి స్వాతిని అమ్మో అని జడుసుకునేలా తయారు చేశాడు డైరెక్టర్. 28ఏళ్లు నిండినా నేనింకా చిన్నపిల్లనే అనేటట్టుండే ఈ తెలుగమ్మాయి.. తొలిసారిగా హారర్ మూవీలో లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇప్పటివరకూ చేయని రోల్ కావడంతో.. కాస్త ఎగ్జయిటింగ్ గానే ఉంది. హారర్ కాన్సెప్ట్ ఒకటే కాదు... ఇండస్ట్రీలోకొచ్చి ఇన్నేళ్లయినా, సౌతిండియాలో అన్ని భాషల్లోనూ నటించేసినా.. ఇప్పటివరకూ పెళ్లైన యువతి కేరక్టర్ చేయలేదు స్వాతి. లుక్ లో ఏజ్ కనపడదు కదా.. అందుకే డైరెక్టర్ లు ఎవరు ఆ ధైర్యం ఎవరూ చేయలేదు.
మొదటిసారిగా మారీడ్ ఉమన్ కేరక్టర్ చేస్తుండడంతో.. ముందునుంచే ఎగ్జయిట్ మెంట్ ఫీలయిందట స్వాతి. దానికి తోడు ఈ మూవీ హీరో నవీన్ చంద్రకి కూడా ఇలా పెళ్లైన వ్యక్తిగా నటించడం ఇదే మొదటిసారి. దీంతో వీళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరిందని యూనిట్ టాక్. ఓ కేరక్టర్ చేసేసినా సరే.. పెళ్లి చేసుకోవాలంటే మాత్రం చాలా ధైర్యం ఉండాలని స్వాతి అంటోంది. అసలు జనాలకు అంత ధైర్యం ఎలా వస్తుందో అని ప్రశ్నిస్తోంది కూడా.