పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దర్శకుడు క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం హరి హర వీరమల్లు. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ టైటిల్ ను ఈ మధ్యనే అనౌన్స్ చేసిన దర్శకుడు.. హై ఓల్టేజ్ రెస్పాన్స్ క్యాచ్ చేశాడు. దీంతో.. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్.. అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
15వ శతాబ్దం నాటి మొఘల్ రాజ్య పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే.. చార్మినార్ సెట్ ను నిర్మించారు. గండికోట సంస్థానాన్ని కూడా దించేశారు. ఇంకా పలు చారిత్రక ప్రాంతాల సెట్లు వేశారు.
కాగా.. ఈ నెల 27 నుంచి మొదలైన కొత్త షెడ్యూల్ లో పవన్ పాల్గొంటున్నట్టు సమాచారం. మొత్తం పది రోజులపాటు డేట్స్ కేటాయించగా.. ఈ షెడ్యూల్ లో మేజర్ గా యాక్షన్ పార్ట్ మాత్రమే తెరకెక్కిస్తున్నాడట క్రిష్. అయితే.. ఇది రెగ్యులర్ సినిమా కాదుకాబట్టి.. ఇందులో ఫైట్లు కూడా రెగ్యులర్ గా ఉండవు.
రాజుల కాలం నాటి సినిమా కాబట్టి.. కత్తి, మల్లయుద్దాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో.. అలాంటి ఫైట్లలో ఆరితేరిన బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ షామ్ కౌశల్ ను రంగంలోకి దించాడట క్రిష్. ఇవాళే హైదరాబాద్ లో దిగిన ఆయన సెట్లో పాల్గొన్నాడట.
ఈ విషయాన్ని స్వయంగా షామ్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ''ఒక సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ మరియు చక్కని మనిషి క్రిష్ తో వీరమల్లు కోసం పనిచేస్తున్నా. ప్రతీ మంచి షాట్ తర్వాత మేము పిల్లల్లాగే నవ్వుకుంటున్నాం. గాడ్ బ్లెస్ అవర్ మూవీ'' అని ట్వీట్ చేశారు. దీంతో.. కొన్ని రోజులపాటు సెట్లో కత్తులు కోలాటం ఆడుతాయని భావించొచ్చు.