సైరా తెలుగు రాష్ట్రాల‌ వ‌సూళ్లు

Update: 2019-10-03 09:16 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా- న‌ర‌సింహారెడ్డి` మొద‌టి రోజు ఎంత వ‌సూలు చేసింది? ఈ ప్ర‌శ్న‌కు ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన స్ప‌ష్ట‌త‌తో స‌మాచారం లేదు. 40-50కోట్ల మ‌ధ్య వ‌సూలు చేసి ఉంటుంద‌ని అంతా అస్ప‌ష్టంగా మాట్లాడుకుంటున్నారు. అస‌లు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత వ‌సూలు చేసి ఉంటుంది?  ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత వ‌సూలైంది? అన్న‌దానికి స‌రైన క్లారిటీ రాలేదు.

తాజాగా తుపాకి ఎక్స్ క్లూజివ్ ఇన్ఫో ప్ర‌కారం.. సైరా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40కోట్లు వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది. సీడెడ్-6.30కోట్లు.. నైజాం-8.13కోట్లు.. వైజాగ్-4.72కోట్లు.. తూ.గో జిల్లా-5.34కోట్లు.. ప‌.గో జిల్లా-4.10కోట్లు.. నెల్లూరు-2.18కోట్లు.. కృష్ణ‌-3.03కోట్లు.. గుంటూరు-5.05కోట్లు.. వ‌సూలైంద‌ని తెలుస్తోంది. ఓవ‌రాల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి 38.85కోట్లు వ‌సూలైంది. ఆ మేర‌కు ప్ర‌ముఖ నిర్మాత వ‌సూళ్ల వివ‌రాల్ని వెల్ల‌డించారు.

ఈ ఫిగ‌ర్స్ ని బ‌ట్టి తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ మేనియా మ‌రోసారి వ‌ర్క‌వుటైంద‌నే అర్థ‌మ‌వుతోంది. అటు హిందీ బెల్టులో వార్ చిత్రంతో పోటీ వ‌ల్ల ఆశించినంత రాలేదు. క‌ర్నాట‌క వ‌సూళ్లు బావున్నాయి. త‌మిళ‌నాడు ఆశించినంత లేదు. ఓవ‌ర్సీస్ సుమారు 7కోట్లు వ‌సూలైంద‌ని రిపోర్ట్ అందింది. అయితే ద‌స‌రా సెల‌వులు ఈ సినిమాకి పెద్ద ఎత్తున క‌లిసి రానున్నాయి. తొలి వీకెండ్ వ‌సూళ్ల రిపోర్ట్ మ‌రింత మెరుగ్గా ఉంటుంద‌నే విశ్లేషిస్తున్నారు. దాదాపు 200 కోట్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూలైతేనే హిట్టు సినిమా కింద లెక్క అంటూ ట్రేడ్ చెబుతోంది.



Tags:    

Similar News