రెండు వందల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' బయోపిక్ ను రూపొందించింది మెగా ఫ్యామిలీ. అత్యంత భారీతనంతో, ఆకట్టుకునే సెట్టింగ్స్ తో, మైమరపించే వీఎఫ్ఎక్స్ తో ఆ సినిమాను రూపొందించారు. రేనాటి సూర్యుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ లో ఆ ప్రాంతంలోని వివిద లొకేషన్లను చూపించారు. ఆ లొకేషన్లలో కూడా భారీతనం ఉంది. విశేషం ఏమిటంటే.. అవన్నీ రాయలసీమ ప్రాంతంలోని వివిధ ఒరిజినల్ లొకేషన్లే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన జీవనగమనంలో సంచరించిన వివిధ ప్రాంతాలను సినిమాలో చూపించారు. అవన్నీ కూడా వాస్తవ పరిసరాలే. ఆ పరిసరాలను ఇప్పుడు కూడా చూడవచ్చు.
రాయలసీమ ప్రాంతంలో, రేనాటి ప్రాంతంలోని వివిధ లొకేషన్లను సెట్టింగుల ద్వారా, వీఎఫ్ఎక్స్ ల ద్వారా రీ క్రియేట్ చేసుకుని 'సైరా' షూటింగ్ చేశారు. ఆ లొకేషన్ల ఒరిజినల్ రూపాలను మీరు ఈ వీడియోలో చూడవచ్చు. సినిమాతో తీసిపోని రీతిలో ఒరిజినల్ లొకేషన్లు కూడా ఉన్నాయి.
సినిమా ఆరంభంలో .. చిరంజీవి ఇంట్రడక్షన్ జరిగిన తర్వాత ఎద్దుల మందను 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కంట్రోల్ చేసే సీన్లలో కనిపించే లొకేషన్ గండికోట. గండికోట పరిసరాల్లో జాతర జరిగినట్టుగా సినిమాలో చూపించారు.
గండికోట కోట లోపల జాతర జరుగుతూ ఉంటుంది. ఆ పక్కనే పెన్నానది భారీ లోయ ఉంటుంది. ఎద్దులన్నీ మత్తుతో మదమెక్కి పెన్నా లోయలోకి పడిపోయే సీన్లో హీరో వాటన్నింటినీ రక్షిస్తాడు. ఆ పెన్నా లోయ ఇదే. ఈ లొకేషన్ అద్భుతంగా ఉంటుంది. భూమి నిలువునా చీలినట్టుగా.. ప్రకృతి చెక్కిన శిల్పంలా ఉంటుంది ఈ అఘాతం. మధ్యలో పెన్న ప్రవహిస్తూ ఉంటుంది. ఈ లోకేషన్ ను సినిమాలో పలు సార్లు చూపిస్తారు.
ఇక గండికోట ఆలయం, దాని ప్రహరీ సెట్టింగ్ కూడా సినిమాలో పలు సార్లు కనిపిస్తుంది. తన సహచర పాలెగాళ్లతో నరసింహారెడ్డి సమావేశం అయ్యే సీన్లలోని చూపించే సెట్టింగ్ కు ఆధారం గండికోట ఆలయం. ఆ ఆలయాన్ని కూడా సెట్టింగ్ గా రీ క్రియేట్ చేసుకున్నారు. సినిమాలో అనేక సార్లు గండికోట ఆలయం సెట్టింగ్ కనిపిస్తుంది. అలా కనిపించే ఆ ఆలయం ఒరిజినల్ గా ఇలా ఉంటుంది.
అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన కోట నొస్సంలో ఉంటుంది. ఆ కోటను సెట్టింగ్ ను కూడా వాస్తవానికి దగ్గరగానే చూపించారు సినిమాలో. ఇప్పటికీ నొస్సం వద్ద ఆ కోట ఉంది. ఆ లొకేషన్లన్నింటినీ ఈ వీడియోలో చూడవచ్చు..
Full View