మల్టీ స్టారర్ గురించి మాట మార్చేసారే

Update: 2018-04-24 08:47 GMT
ఏడాదికి పైగా కొంచెం వెనక్కు వెళ్తే డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారి ప్రకటన పెను దుమారమే రేపింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపి తానొక మల్టీ స్టారర్ తీయబోతున్నట్టు దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో కొద్ది రోజుల పాటు మోగిపోయింది. కాని చిరు పవన్ లకు విడివిడిగా ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా అది నిజమయ్యే అవకాశం లేదని తర్వాత తేలింది. అదంతా తూచ్ లెమ్మని మెగా ఫాన్స్ కూడా లైట్ తీసుకుని మర్చిపోయారు. కాని సుబ్బరామిరెడ్డి గారు మాత్రం ఆ ప్రస్తావన వదిలిపెట్టడం లేదు. ఇప్పటికీ తాను చిరంజీవితో మాట్లాడుతున్నానని త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని మళ్ళి నొక్కి వక్కాణిస్తున్నారు. కాకపోతే చిరు మెయిన్ లీడ్ లో ఉండటంతో పాటు పవన్ కూడా నటిస్తాడు అని టిప్ ఇచ్చారు. అంటే గతంలో శంకర్ దాదా జిందాబాద్ లో క్లైమాక్స్ ఫైట్ లో పవన్ ఎంట్రీ ఇచ్చినట్టుగా ఏదైనా ఉంటుందేమో.

ఇది ఇప్పుడు ఎవరు విశ్వసించడం లేదు కాని సుబ్బరామి రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. 1988లో వెంకటేష్-అర్జున్-రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా త్రిమూర్తులు అనే మల్టీ స్టారర్ తీసిన సుబ్బరామిరెడ్డి అందులో టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరూ పాట కోసం ఒకే ఫ్రేంలో వచ్చేలా చేయగలిగారు. అందులో వెంకటేష్ వీళ్ళందరికీ కావల్సినవి అందించే సర్వర్ పాత్రలో పాట పాడుతూ కనిపిస్తారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే చాలా కాలం తర్వాత షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓం మూవీలో అచ్చం అలాగే బాలీవుడ్ స్టార్స్ ని చూపించారు. నాగార్జున కింగ్ లో కూడా అలాంటి పాటను చూడొచ్చు. సో సుబ్బరామిరెడ్డి కున్న పరిచయాలకు ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీ తో ఉన్న అనుబంధం దృష్ట్యా అదేమి అసాధ్యం కాదు కాని జనసేన కోసం పూర్తిగా సినిమాలు వదిలేసిన పవన్ చేయటం గురించే అసలు అనుమానం. జరిగినా జరగకపోయినా ఈ వార్త ప్రతి సారి ఫాన్స్ కి కిక్కిచ్చేదే.
Tags:    

Similar News