తల్లితండ్రులు భక్తవత్సలం నాయుడు అని పేరుపెట్టారు.. గురువు గారు దర్శకరత్న మోహన్ బాబు అని పేరుమార్చారు.. అభిమానులు మాత్రం కలెక్షన్ కింగ్ అని పిలుచుకుంటారు. నచిన్నవాళ్లు.. మాట కటువు కానీ, మనసు వెన్న అంటుంటే.. నచ్చని వారు మాత్రం కోపిస్టి అని చెప్పుకుంటుంటారు. నటుడిగా - నిర్మాతగా - విద్యావేత్తగా - రాజకీయనాయకుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు డాక్టర్ మంచు మోహన్ బాబు.
ఒక సాధారణ నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన బక్తవత్సలం.. నేడు కలెక్షన్ కింగ్ గా డాక్టర్ మోహన్ బాబుగా ఈరోజు ఈ స్థాయిలో ఉండటం వెనక 40ఏళ్ల కృషి ఉంది. ఇప్పటికే కెరీర్ పరంగా - వ్యక్తిగా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన.. తెలుగు రాష్ట్రప్రజలకు అభిమాననటుడయ్యారు. ఈ సమయంలో తన నటజీవితంలో నలభై వసంతాలు పూర్తిచేసుకున్న మోహన్ బాబు ఎందరో నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్న మోహన్ బాబు... యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు కూడా అందుకున్నారు.
ఈ సందర్భంగా సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే పలుకార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో అత్యంత వైభవంగా.. ఒక వేడుకను నిర్వహించాలని భావించారు కళాబందు టి. సుబ్బిరామిరెడ్డి. సినీ పరిశ్రమతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న సుబ్బిరామిరెడ్డికి మోహన్ బాబుతో ప్రత్యేక అనుబందం ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మోహన్ బాబు నటుడిగా 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖపట్నం లో సెప్టెంబరు 17న ఒక భారీ వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకకు భారత్ దేశం మొత్తం నుంచి పలువురు సినీ -- రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారట. న భూతో న భవిష్యత్ అనేలా ఈ వేడుకను అథంత ఘనంగా నిర్వహించాలని టి.ఎస్.ఆర్. ప్లాన్ చేస్తున్నారని సమాచారం.