మీ చూపులను మార్చుకోండి

Update: 2017-11-22 04:27 GMT
సోషల్ మిడియలోకి ఒక్కసారి సెలబ్రెటీలు అడుగుపెడితే పాజిటివ్ - నెగిటివ్ కామెంట్స్ లను సమానంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆడియెన్స్ మైండ్ సెట్ ని బట్టి ప్రవర్తించాలి అనే ఒక ఆలోచన వస్తోంది. కానీ కొంత మంది సెలబ్రిటీలు మాత్రం నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు చాలా కోపానికి లోనవుతున్నారు. అందులో ఎక్కువగా హీరోయిన్స్ ఉంటున్నారు.

ఈ మధ్యన హీరోయిన్స్  హాట్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఒక్కోసారి పాజిటీవ్ కామెంట్స్ వస్తుండగా మరికొన్ని సార్లు తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో  హీరోయిన్స్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆగ్రహానికి లోనవుతున్నారు. రీసెంట్ గా ఢిల్లీ బ్యూటి తాప్సి కూడా ఒక్కసారిగా సీరియస్ అయిపోయి కోలీవుడ్ నెటీజన్స్ పై మండిపడింది. అమ్మడు కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా చేసిన కొన్ని సినిమాలతోనే బాగా పాపులారిటిని సంపాదించుకొంది.

అయితే అమ్మడు ఈ మధ్యన పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫొటోలకు టాలీవుడ్ - బాలీవుడ్ ఆడియెన్స్ బాగా మెచ్చుకున్నారు. కానీ ఒక్కసారిగా తాప్సి ఘాటుగా కనిపించే సరికి తమిళ తంబీలకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో హాట్ గా కనిపించేలా డ్రెస్సులు ధరిస్తున్నందునే పురుషులు తప్పుడు చూపులతో చూస్తున్నారని అలాగే తాప్సి డబ్బు కోసమే ఈ విధంగా నటిస్తోంది అనేలా కామెంట్స్ చేశారు. అయితే తాప్సి వారికి చిన్న కామెంట్ తో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మీరందరూ అంత మంచి వారు అయితే ఎందుకు తప్పుడు చూపులతో చూస్తున్నారు? ముందు మీ చూపులను మార్చుకోండని ఈ సొట్ట బుగ్గల సుందరి బాదులిచ్చింది.


Tags:    

Similar News