ట్రోలర్స్ పై మళ్ళీ సెటైరేసిన తాప్సీ పన్ను!

Update: 2018-09-23 08:05 GMT
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'మన్మర్జియాన్' రీసెంట్ గా రిలీజ్ అయింది.  క్రిటిక్స్ చేత ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి.. అనురాగ్ గత చిత్రాల లాగానే వివాదాలు తప్పలేదు.  రియలిస్టిక్ సీన్స్ ను తెరకెక్కించడంలో అనురాగ్ స్పెషలిస్ట్.  షుగర్ కోటింగ్ అనే పదానికి బారెడు దూరంలో ఉంటాడు. ఈ సినిమాలో ఒక సీన్ వివాదం రాజేసింది. రాబీ పాత్ర పోషించిన అభిషేక్ బచ్చన్ గురుద్వారా లో తన పెళ్లి తంతు పూర్తికాగానే బయటకు వచ్చిన తలపాగా తీసి సిగరెట్ వెలిగిస్తాడు.

ఇక ఈ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సినిమా నిర్తర్మాతలయిన ఈరోస్ ఇంటర్నేషనల్ వారు సినిమానుండి దానిని తొలగించారు. అలా తొలగించడం అనురాగ్ కశ్యప్ కు కూడా తెలియదట. దీంతో తన ట్విట్టర్ ద్వారా నిరసన తెలుపుతూ "ఆ సీన్ తీసేసినందువల్ల పంజాబ్ లో ఉండే ప్రాబ్లెమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అదొక స్వర్గం అవుతుంది. ఈసారి మీకు ఒక సినిమా వల్ల ఇబ్బంది ఎదురైతే కిషోర్ లుల్లా(ఈరోస్ అధినేత) కు కాల్ చేయండి.. పరిష్కారం క్షణాల్లో లభిస్తుంది" అన్నాడు.

ఇక తాప్సీ పన్ను కూడా తక్కువ తినలేదు. ఆ సీన్స్ పై వివాదం క్రియేట్ చేసిన వాళ్ళకు.. తనను ట్రోల్ చేస్తున్న వాళ్ళకు కలిపి టోకుగా చురకలంటించింది.  ట్విట్టర్ లో "ఏ సిక్కు కూడా ఇకనుండి స్మోకింగ్ చెయ్యకుండా.. ఏ మహిళ కూడా గురుద్వారాలో పెళ్ళిచేసుకునే సమయంలో 'ఎవరి గురించి' అసలు ఆలోచించకుండా ఉండేందుకు ఈ సీన్ కట్ చేయడం ఉపయోగపడుతుందని అనుకుంటున్నా" అంటూ ట్వీటేసింది.  మరి ఈ వివాదం ఇంతంటితో ఆగుతుందో లేదా మరింతగా ముడురుతుందో వేచి చూడాలి.
    

Tags:    

Similar News