ఒక రేంజ్ స్టార్ అయ్యేవరకు అయ్యా బాబూ అనడం.. అయిపోయాక మాత్రం అసలు ఎవర్రా మీరు అనడం.. ఇది తెలుగు ఇండస్ర్టీలో ఎప్పటినుండో సాగుతున్న ఒక ఆచారం. మన ఫిలిం మేకర్స్ కు బుద్దిలేక కాని.. కోరితెచ్చి మరీ ఈ నార్త్ పాపలను ఇక్కడ స్టార్స్ ను చేస్తే.. వాళ్ళు మాత్రం అవసరం తీరిపోయాక నానా కామెడీ చేసేస్తుంటారు. అదిగో ఇప్పుడు ఝుమ్మంది నాదం సినిమాతో తనకు హీరోయిన్ ఛాన్సిచ్చిన కె.రాఘవేంద్రరావు పైన అమ్మడు అలాంటి జోకులే వేసింది.
నిజానికి ఒక యుట్యూబ్ కామెడీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో.. తన మీద తానే బోలెడంత జోకులు వేసుకున్న తాప్సీ.. చాలా సెటైర్లు కూడా వేసిందిలే. తను ఢిల్లీ నుండి వచ్చిన ఒక సిక్కుల అమ్మాయి అని తెలిసికూడా.. ఒక సినిమాలో తనకు దర్శకుడు ఆ రోల్ ఇవ్వలేదని.. నువ్వు అంత కన్విన్సింగ్ గా లేవని అన్నాడని చెప్పింది. అలా ఎందుకు అన్నాడు అంటే.. ''అప్పుడు అతను వేరే ఎవరినో టేస్ట్ చేస్తున్నాడులే'' అని చెప్పింది. ఆ టేస్ట్ లో ఉన్న బూతేంటో మనకు బూతద్దం వేయకపోయినా తెలుస్తుందిగా. ఇప్పుడు అమ్మడు అదే తరహాలో సౌత్ లో హీరోయిన్లను చూపించే సెన్సుయాలిటీ గురించి కూడా సెటైర్లు వేసింది.
''నా తొలి సినిమాను తీసిన దర్శకుడు అప్పటికే 150 సినిమాలు తీశాడు. శ్రీదేవి జయప్రద వంటి స్టార్లను లాంచ్ చేశాడు. అదేంటో తెలియదు కాని తన సినిమాల్లో హీరోయిన్ బొడ్డును నడుంను పువ్వులతో పళ్ళతో కొడతారు. సర్లే మనం కూడా శ్రీదేవి రేంజులో అయిపోతామేమోనని అనుకున్నాను. కాని నా ఫస్ట్ డే షూటింగే ఒక పాట.. అందులో ఒక కొబ్బరి చిప్పతో నా బొడ్డును కొట్టారు. నేనేమో నా బొడ్డు దగ్గర సరిగ్గా వర్కవుట్ చేయలేదని వర్రీ అయ్యాను కాని.. ఆయన అలా కొబ్బరికాయతో ఎందుకు కొట్టారో నాకు తెలియలేదు. అదేం సెన్సుయాలిటీయో మరి'' అంటూ చెప్పింది. ఇది విన్న నార్త్ ఇండియన్ ఆడియన్స్ అందరూ హ్యాపీగా నవ్వుకున్నారులే. కాని విషయం ఏంటంటే.. అమ్మడు ఇదంతా చెబుతూ కె.రాఘవేంద్రరావును ఫుల్లుగా అవమానించేసింది అంతే. ఇదంతా చూసిన తెలుగు ప్రేక్షకులు.. ఆమె ఎగస్ర్టాలు పీక్స్ కు చేరిపోయాయ్ అంటూ కామెంట్స్ చేసేశారు.
ఒకవేళ అదంతా అంత వింతగా కనిపిస్తే.. తాప్సీ చేయడం దేనికి? పూర్తిగా చేసేసి.. ఆ తరువాత మరో డజను తెలుగు సినిమాల్లో నటించి.. ఇప్పుడేమో సెన్సుయాలిటీ అంటూ కామెంట్లు ఏల రింగుల జుత్తు గంగా? అసలు ఈ కామెంట్లను ఆమెకు వెర్రీ థిక్ స్నేహితులైన మంచు లక్ష్మి.. మంచు మనోజ్ వింటున్నారా?