కృష్ణానగర్ కష్టాలపై కథలు కథలుగా చెప్పుకుంటారు ఫిలిం జనం. సినిమావోళ్లు అంటేనే అందరికీ లోకువ. అద్దెకిచ్చేందుకు ఎవరూ ముందుకు రారని.. అప్పు అసలే పుట్టదని వాపోయేవాళ్లెందరో. పిల్లనిచ్చేవాళ్లు అయితే అసలే దరికి చేరనివ్వరు! అయితే ఈ తరహా కృష్ణానగర్ కష్టాలు ఎవరో అనామకులకే అనుకుంటే పొరపాటే. అలాంటి ఇబ్బందులెన్నో ఎదుర్కొని ఢక్కా మొక్కీలు తిని ఏదోలా మొత్తానికి ఇన్నాళ్టికి సెటిలైందట అందాల తాప్సీ.
తాను ముంబై పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో అద్దె గది కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొందిట తాప్సీ(31). `నటిని అని చెబితే చాలు` ఎవరూ అపార్ట్ మెంట్ అద్దెకిచ్చేవారు కాదట. అసలు ఆ ఉద్యోగాన్నే ఎవరూ నమ్మేవారే కాదని చెప్పుకుని గతం ఎంత దుర్భరమో గుర్తు చేసుకుంది పాపం. ప్రస్తుతం తాను నటించిన `గేమ్ ఓవర్` సినిమా ప్రచార కార్యక్రమంలో తాప్సీ ఇలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతోంది. ఈ సినిమాని తెలుగు - తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ చేసేందుకు తాప్సీ చాలా సీరియస్ గానే ప్రమోట్ చేస్తోంది.
అన్నట్టు ఇలా అద్దెకు.. అద్దె గది కోసం పడి ఏడ్వడం ఎందుకనే ఇటీవల ముంబైలో ఓ ఖరీదైన ఏరియాలో అపార్ట్ మెంట్ నే కొనుక్కుంది.. ఒకటి కాదు ముంబైలో రెండు ఇండ్లు ఉన్నాయి తాప్సీకి. ఇటు హైదరాబాద్ - చెన్నయ్ లో మాత్రం అద్దె గది సమస్య లేక ఇక్కడ కొనుక్కోలేదేమో కానీ.. ముంబైలో మాత్రం తనకు కావాల్సిన అపార్ట్ మెంట్లు కొనుక్కుంది. 2013లో `ఛస్మే బద్ధూర్` అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన తాప్సీ బేబి-నామ్ షబానా- పింక్- మన్మార్జియాన్ చిత్రాలతో విజయాలు అందుకుని సత్తా చాటింది. ప్రస్తుతం ముంబై పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఆ క్రమంలోనే ఇటు సౌత్ ని ఓ పట్టు పడుతోంది. తాజాగా గేమ్ ఓవర్ సినిమాతో ఇక్కడ తానేంటో చూపించే ప్రయత్నంలో ఉంది. హైదరాబాద్ ఇంటర్వ్యూల్లో `ఝుమ్మంది నాదం` టైమ్ లో తన కష్టాల్ని గుర్తు చేసుకుంటుందేమో చూడాలి.