సొట్ట బుగ్గల సుందరి తాప్సి ఫైనల్ గా బాలీవుడ్ లో స్థానం సంపాదించుకొని హిందీ సినిమాలతో కాస్త బిజీ అయ్యింది. తెలుగులో అమ్మడి అందాలు అంతగా పాపులర్ అవ్వలేదు కానీ నార్త్ జనాలు మాత్రం బాగా ఆకర్షితులు అయ్యారు. ప్రస్తుతం అమ్మడు చాలా హ్యాపీగా ఉంది. అయితే షూటింగ్ నిమిత్తం రీసెంట్ గా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళింది.
అయితే అక్కడ వాతావరణం చాలా కూల్ గా ఉందని.. కాని సంవత్సరంలో ఈ నెలలో ఇలాంటి పొగమంచు కనిపించడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడి పొగ మంచుకు సూర్యుడు కూడా చిన్నబోయాడు అంటూ కామెంట్ చేసింది. ఈ సంవత్సరం వాతావరణం నిజంగా చాలా కూల్ గా ఉందని కూడా వివరించింది. అయితే ఢిల్లీలో ప్రస్తుతం పొగ మంచు చాలా వచ్చేసింది. బుధవారం దాదాపు ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ నమోదైందట. ఇక పొగ మంచుకి ఎదురుగా వచ్చే మనిషి కూడా కనిపించడం లేదట. కాని కేవలం వాతావరణం చల్లబడటం వలనే కాదు.. అక్కడి కాలుష్యం కారణంగా ఈ పొగమంచు పట్టేసింది.
ప్రస్తుతం తాప్సి అక్కడ ముల్క్ అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో రిషి కపూర్ కోడలిగా లాయర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ప్రతీక్ బబ్బర్ - రజత్ కపూర్ అలాగే అశుతోష్ రాణా మరియు నీనా గుప్త కూడా సినిమాలో నటిస్తున్నారు.