తాప్సీ పన్ను ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ లో రెచ్చిపోతోన్న సంగతి తెలిసిందే. తన ట్యాలెంట్ చూపించే ఛాన్స్ రావడంతో.. దక్షిణాది సినిమాలపై రాళ్లేసేందుకు కూడా వెనకాడని ఈ భామ.. ఇప్పుడో నిమిషంన్నర వీడియోతో ఆకట్టుకుంది. అక్షయ్ కుమార్ అభిమానులతో పంచుకున్న వీడియోలో.. ప్రధాన పాత్ర తాప్సీదే.
మహిళలు తాము అబలలం అని కుంగిపోవాల్సిన పని లేదని.. వారిలో ఎన్నో శక్తి సామర్ధ్యాలు దాగుంటాయని చెబుతున్న తాప్సీ.. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలని చెబుతోంది. ఏ నిమిషానికి ఏది పనికొస్తుందో తెలీదు కాబట్టి.. ముందుగానే అన్నీ నేర్చేసుకోవాలన్నది ఈమె చెబుతున్న మాట. "స్తంభించిపోకండి.. గ్రహించండి.. ప్రతిస్పందించండి.. మీతోనే ఓ పెద్ద ఆయుధం ఉందని తెలుసుకోండి. చూడండి, నేర్చుకోండి, #kohnimaarతో మీ మూవ్ పంచుకోండి. ఎప్పుడేది పనికొస్తుందో ఎవరికి తెలుసు"అని ట్వీట్ చేసింది తాప్సీ.
ఈ వీడియో చివరి 10 అదిరిపోయిందంతే. అక్షయ్ కుమార్ వెనకనుంచి వచ్చి తాప్సీని పట్టుకోవడం.. కుడి చేత్తో పొట్టలో గుద్ది.. వెనక్కి తిరిగి ఓ యాక్షన్ సీక్వెన్స్ నే చూపించింది తాప్సీ. కొట్టినట్లు తాప్సీ చేయడం ఓకే కానీ.. కొట్టించుకున్నట్లు అంత పెద్ద యాక్షన్ హీరో చేయడం మాత్రం కేక అంతే. మహిళా దినోత్సవం.. మరోవైపు నామ్ షబానా రిలీజ్ కానుండడం.. అన్నిటికీ ఉపయోగపడేలా.. బేబీ టీం బాగానే ప్లాన్ చేశారుగా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/