నటిని అనగానే మొహం మీదే నో చెప్పారు : తాప్సి

Update: 2019-06-08 04:54 GMT
సినిమా వారి జీవితాలు చాలా కలర్‌ ఫుల్‌ గా ఉంటాయని అంతా అనుకుంటారు. కాని ఆ కలర్‌ ఫుల్‌ లైఫ్‌ లో కూడా చీకటి కోణం ఉంటుంది. సెలబ్రెటీలు ప్రతి ఒక్కరికి మంచి జీవితం ఉంటుందని చెప్పలేం. కొద్దిగొప్ప గుర్తింపు వచ్చిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. బయట సమాజంలో వచ్చిన గుర్తింపు కారణంగా ఏ పని పడితే ఆ పని చేయలేక పోవడంతో పాటు.. కాస్త స్టేటస్‌ మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మంచి ఇల్లు పోర్షన్‌ అద్దెకు తీసుకోవాలనుకుంటే పెద్ద తలనొప్పి వ్యవహారం.

ఈ తలనొప్పి వ్యవహారంను తాప్సి భరించిందట. ఢిల్లీకి చెందిన తాప్సి సినిమాల్లో నటించేందుకు ముంబయి చేరిందట. ముంబయిలో ఉండేందుకు అద్దె ఇల్లు కోసం ఎంత వెదికినా దొరకలేదట. ఒక వేళ ఉన్నా కూడా నటిని అంటూ చెప్పగానే మొహంపైనే యాక్టర్స్‌ కు ఇల్లు అద్దెకు ఇచ్చే ఆలోచన లేదు అంటూ చెప్పేసేవారు. చాలా మంది హీరోయిన్‌ గా ప్రయత్నిస్తున్నాను అంటూ చిన్న చూపు చూడటం కూడా చేశారని గత జ్ఞాపకాలను ఈ అమ్మడు నెమరేసుకుంది.

ముంబయితో పోల్చితే హైదరాబాద్‌ లో ఈ ఇబ్బంది చాలా చాలా తక్కువ. సెలబ్రెటీలకు ఇల్లు కిరాయికి దొరికే విషయంలో హైదరాబాద్‌ లో పెద్దగా ఇబ్బందులు లేవని తాప్సి చెప్పుకొచ్చింది. హైదరాబాద్‌ లో ఎలాంటి ఏరియాలో అయినా.. ఎలాంటి ఇల్లు అయినా నటీ నటులకు లభిస్తుందనే అభిప్రాయంను తాప్సి వ్యక్తం చేసింది. ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌ లో కూడా జనాలు చాలా స్నేహపూరితంగా ఉంటారని అందుకే నాకు హైదరాబాద్‌ అంటే ఇష్టమంది. తాను హైదరాబాద్‌ లో ఒక ప్లాట్‌ తీసుకున్నాను.. దాంట్లో చెల్లితో కలిసి ఉంటున్నాను. అమ్మానాన్న ఢిల్లీలో ఉంటున్నారని తాప్సి చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News