`చినీకమ్` చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది టబు. కెరీర్ లో రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారం దక్కించుకుంది. ఇటీవల కొంత గ్యాప్ ఇచ్చినా ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల దక్షిణాదిపైనా తబు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో అవకాశం వస్తే నటించేందుకు ఓకే చెబుతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న విరాట పర్వం చిత్రానికి టబు ఓకే చెప్పారని ఇటీవల ప్రచారమైంది. ఇందులో మానవ హక్కుల పోరాట నాయకురాలిగా టబు పాత్ర ఉంటుందని అన్నారు. కానీ ఇంతలోనే ఈ ప్రాజెక్టు నుంచి టబు తప్పుకున్నారని ప్రచారమవుతోంది. టబు స్థానంలో అదే రోల్ కి మరో సీనియర్ నటి నందిత దాస్ ని కన్ఫామ్ చేశారట.
అయితే అంత సమస్య ఏం వచ్చింది? అంటే టబు బాలీవుడ్ లో పలు చిత్రాలకు కమిటయ్యారు. దీంతో ఇరు భాషల్లో మ్యానేజ్ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. కాల్షీట్ల పరమైన సమస్య తలెత్తిందట. అందుకే రానా ప్రాజెక్టును తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఏదేమైనా టబు లాంటి కరిష్మా ఉన్న కథానాయిక తప్పుకోవడం నష్టం కలిగించేదే. పైగా ఈ చిత్రం రానాకు చాలా ప్రతిష్ఠాత్మకమైనది. రానా ఇందులో నక్సలైట్ పాత్ర పోషించనుండగా.. సాయి పల్లవి జర్నలిస్ట్‌గా నటించనుంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉండేవో ఈ చిత్రంలో చూపించనున్నారు. అప్పటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ ని జోడించారు.