ఎలాంటి డైరెక్టర్ ఎలా అయిపోయాడు?

Update: 2015-12-12 10:04 GMT

Full View

ఒక ‘ఆ నలుగురు’.. ఒక ‘పెళ్లైన కొత్తలో’... ఇవే కాక ఫ్లాప్ అయిన గుండె జల్లుమంది, ప్రవరాఖ్యుడు లాంటి సినిమాలు చూసినా.. అన్నింట్లోనూ ఒక ఫీల్ ఉంటుంది. ఒక టేస్టున్న డైరెక్టర్, రైటర్ కనిపిస్తాడు. ఈ సినిమాలన్నింటి వెనుక ఉన్న పేరు మదన్. ‘ఆ నలుగురు’ లాంటి క్లాసిక్ మూవీతో రచయితగా పరిచయమై.. పెళ్లయిన కొత్తలో లాంటి ఫీల్ గుడ్ మూవీతో దర్శకుడిగా మారిన మదన్.. ఎప్పుడూ మనసు తలుపు తట్టే సినిమాలే తీయడానికి ప్రయత్నించాడు. కానీ అతడి తర్వాతి రెండు సినిమాలు నిరాశ పరచడంతో ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేశాడు.

సాయికుమార్ తనయుడు ఆది కథానాయకుడిగా మదన్ రూపొందించిన ‘గరమ్’ టీజర్ నిన్న రిలీజైంది. ఆ ట్రైలర్ చూస్తే ఆ మదన్.. ఈ మదన్ ఒక్కడేనా అని ఆశ్చర్యపోవడం ఖాయం. టీజర్ చివర్లో షకలక శంకర్ రోడ్డు పక్కన పాస్ పోస్తుంటాడు. ఇలా పోస్తే.. పోలీసులు పట్టుకెళ్తారు అంటే.. ‘‘అది పట్టుకుని పోయి పోలీసులు ఏం చేస్తారు’’ అంటాడు షకలక శంకర్. మదన్ లాంటి రైటర్ కమ్ డైరెక్టర్ ఇలాంటి డైలాగ్ రాస్తాడని.. ఇంత మాస్ గా ఆలోచిస్తాడని ఊహించలేం. టీజర్ అంతా కూడా ఇలాగే మాస్ మాస్ గా ఉంది. ఎంత ఫెయిల్యూర్లో ఉంటే మాత్రం మరీ మదన్ లో ఇంత మార్పు వచ్చేసిందేంటో?
Tags:    

Similar News