బిజీగా వున్నారు. తెలుగు సినిమా మార్కెట్ విస్తరించిన తర్వాత పాన్ ఇండియా చిత్రాలు చేయటానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో కొందరు దర్శకులు మాత్రం చాలా కాలంగా ఖాళీగా ఉంటున్నారు. తమ తదుపరి సినిమాల గురించి అప్డేట్స్ ఏమీ లేకుండా సైలెంట్ గా ఉంటున్నారు.
'కొత్త బంగారులోకం' 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు ఎవరితో ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో క్లారిటీ లేదు. చివరగా 'నారప్ప' చిత్రంతో పలకరించిన దర్శకుడు.. ఏడాది దాటిపోయినా ఇంతవరకూ తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించలేదు.
అప్పట్లో ''అన్నాయ్'' అనే టైటిల్ తో ఓ పెద్ద సినిమా చేయనున్నట్లు శ్రీకాంత్ అడ్డాల చెప్పాడు. ఇది గుంటూరు బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని.. మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వుంటుందని హింట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి ప్రకటన లేదు.
'బొమ్మరిల్లు' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన భాస్కర్.. 'ఒంగోలు గిత్త' ఫ్లాప్ తర్వాత తెలుగులో దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా చేసి.. బ్లాక్ బస్టర్ అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఈ మూవీ వచ్చి ఏడాది దాటిపోయినా దర్శకుడు ఇంకా తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.
ఫ్లాప్ పడిన తర్వాత గ్యాప్ రావడం సహజమే. కానీ హిట్ పడితే వీలైనంత త్వరగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తుంటారు. కానీ భాస్కర్ హిట్టిచ్చినా కూడా యేడాది కాలంగా సినిమాని అనౌన్స్ చేయలేదు. అక్కినేని నాగచైతన్య తో చేస్తారని టాక్ వచ్చింది కానీ.. నిజం కాలేదు.
'రన్ రాజా రన్' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్.. ఆ తర్వాత ప్రభాస్ 'సాహా' వంటి పాన్ ఇండియా మూవీ చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. దీంతో దర్శకుడికి చాలా గ్యాప్ వచ్చింది. 'లూసిఫర్' రీమేక్ చేజారిన తరవాత.. ఏ ప్రాజెక్ట్ చేస్తాడనే దానిపై స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి స్క్రిప్టు రాసుకుంటున్నాడని టాక్ వచ్చింది కానీ.. ఇంత వరకూ ఎలాంటి ప్రకటన లేదు.
'వెన్నెల' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన దేవా కట్టా.. 'ప్రస్థానం' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే టాలెంటెడ్ డైరక్టర్ ఆ తరవాత ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. గతేడాది 'రిపబ్లిక్' మూవీ కూడా దర్శకుడికి బాక్సాఫీస్ సక్సెస్ అందించలేదు. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు.
అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య స్నేహం మరియు రాజకీయ వైరం ఆధారంగా 'ఇంద్రప్రస్థం' అనే పేరుతో ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్ చేయనున్నట్లు దేవ కట్టా తెలిపారు. కానీ సినిమా ఎక్కడి దాకా వచ్చిందనేది తెలియదు. అయితే ఇప్పుడు దర్శకుడు బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
'RX 100' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి.. గతేడాది 'మహా సముద్రం' చిత్రంతో ఫ్లాప్ అందుకున్నాడు. అప్పటి నుంచి దర్శకుడు మరో ప్రాజెక్ట్ ని పట్టలెక్కించలేదు. అయితే ఇప్పుడు 'మంగళవారం' అనే సినిమా చేస్తున్నట్లు టాక్ వచ్చింది కానీ.. అధికారిక ప్రకటన లేదు.
ఇలా టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ రావడం లేదు. మంచి టాలెంట్ ఉన్న దర్శకులు మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా.. సినిమాలు చేసి అలరించాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. మరి త్వరలోనే ఈ దర్శకులు తమ కొత్త సినిమాలను ధృవీకరిస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.