అందాల చందమామ కాజల్ అగర్వాల్ బేబి బంప్ గురించి అభిమానుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అని గత కొన్ని వారాలుగా కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను కాజల్ కానీ తన భర్త గౌతం కిచ్లూ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఒకానొక సందర్భంలో కాజల్ తన బేబి బంప్ గురించి తానే వెల్లడిస్తానని.. అత్యుత్సాహం తగదని మీడియాపై సీరియస్ అయ్యింది.
కానీ తాజాగా కాజల్ అగర్వాల్ ఓ గ్రూప్ ఫోటోలో కనిపించిన తీరు రకరకాల సందేహాలకు తావిస్తోంది. కాజల్ చిన్న బేబి బంప్.. బాడీ హగ్ డ్రెస్ లో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇటీవల తన స్నేహితులు సోదరి నిషా అగర్వాల్ కిడ్స్ తో కలిసి కాజల్ లంచ్ ఔటింగ్ కోసం వెళ్ళింది. స్పాట్ నుంచి వచ్చిన కొన్ని ఫోటోల్లో కాజల్ అందమైన చిన్న బేబీ బంప్ తో కనిపిస్తోంది.
దీంతో ప్రెగ్నెన్సీ పుకార్లు మరింత తీవ్రతరం అయ్యాయి. ఇక కాజల్ దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని సోషల్ మీడియాల్లో టాక్ వినిపిస్తోంది. బేబి బంప్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి లీకుల నేపథ్యంలో త్వరలో గర్భం గురించి కాజల్ అధికారిక ప్రకటన చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో కాజల్ కనిపించనుంది. ఫ్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున సినిమాతో పాటు.. భారతీయుడు 2 నుంచి కాజల్ వైదొలగిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. కాజల్ నటించిన పలు చిత్రాలు విడుదలకు రావాల్సి ఉంది.