నాని ఓవర్ చేశాడా.. చూద్దాం!

Update: 2017-02-03 06:15 GMT
కొన్ని రోజులుగా టాలీవుడ్లో చాలా మంది నోట ఒక మాట వినిపిస్తోంది. నానికి కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోతుందీ.. ఈసారి అతడికి బాక్సాఫీస్ దగ్గర పంచ్ పడుతుందేమో అని. నాని గత సినిమాల మాదిరే.. అతడి కొత్త సినిమా ‘నేను లోకల్’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ తో పాటు ప్రోమోస్ అన్నీ కూడా బాగున్నాయి. ఆడియో హిట్టయింది. కాంబినేషన్ క్రేజ్ కూడా దీనికి కలిసొచ్చింది.

అన్ని రకాలుగా పాజిటివ్స్ కనిపిస్తున్నప్పటికీ.. ఎందుకో ఈ సినిమా గురించి కొంచె నెగెటివ్ కామెంట్స్ పడుతున్నాయి. నాని ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ముంగిట నిలవడంతో జనాలు ఓర్వట్లేదో లేక.. ఎలాంటి వాడికైనా ఏదో ఒక సమయంలో ఎదురు దెబ్బ తగలడం ఖాయమని యాదృచ్ఛికంగా అంటున్నారో కానీ.. ఈ సినిమా విషయంలో కొందరు జనాలు నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. ఈ సినిమాను అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడం.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు అమెరికాలో పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో.. నానిది ఓవర్ కాన్ఫిడెన్స్.. నానిది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న మాటలు ఎక్కువైపోయాయి.

ఈ వ్యాఖ్యానాల సంగతెలా ఉన్నా ‘నేను లోకల్’కు బుకింగ్స్ అయితే అదిరిపోయాయి. పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమాకు నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయమని తేలిపోయింది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. జనాలన్నట్లు అతడిది ఓవర్ కాన్ఫిడెన్సేనా.. ఆ కాన్ఫిడెన్స్ తో బోల్తా కొట్టేస్తాడా.. చూద్దాం ఏమవుతుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News