టాక్ షో సాక్షిగా క‌ర‌ణ్ జోహార్ ని పేకాడేసిన అమీర్ ఖాన్!

Update: 2022-08-02 17:30 GMT
'కాఫీ విత్ క‌ర‌ణ్' టాక్ షో సంచల‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ టాక్ షోకి వెళ్లాలంటే? ద‌మ్ము దైర్యం ఉండాలి. సౌత్ హీరోల్ని అంటే క్షమించి వ‌దిలేస్తాడేమో గానీ...హిందీ హీరోలు గానీ..క్రికెట‌ర్లు గానీ షోకి హాజ‌రైతే ఆద్యంతం రంజు రంజుగానే టాక్ షో న‌డుస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి...సెక్స్ లైఫ్ గురించి ఎంతో ఓపెన్ గా క‌ర‌ణ్ ప్ర‌శ్న‌లు ంటాయి.

వాటికి గెస్ట్ లు అంతే ఓపెన్ గా స‌మాధానం ఇస్తుంటారు. క‌ర‌ణ్ టాక్ షో స‌క్సెస్ సీక్రెట్ ఇదొక్క‌టే. ఇండియాలో ఏ షోలో ఇలాంటి ప్ర శ్న‌లుండ‌వు. క‌ర‌ణ్ ఆ పాయింట్ పట్టుకునే టాక్ షోని దేశ వ్యాప్తంగా ఈ రేంజ్లో పాపుల‌ర్ చేసాడు. తాజ‌గా  సీజ‌న్ 7 ప్రోమో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈసారి అమీర్ ఖాన్...క‌రీనాక‌పూర్ గెస్ట్ లు గా హాజ‌ర‌య్యారు.

ఇద్ద‌రు పెళ్లైన‌ వారు. జీవితంలో ఎన్నో అనుభ‌వాలున్నాయి. ఇంకేముంది క‌ర‌ణ్ కూడా చెల‌రేగిపోవ‌చ్చ‌ని భావించాడు. టాక్ షో ఆరంభంలో స‌రదాగానే సాగింది. ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా సీరియ‌స్ మోడ్ లోకి జారుకుంది. అప్ప‌టివ‌ర‌కూ రొటీన్ ప్రశ్న‌ల‌తో విసిగిపోయిన క‌ర‌ణ్ ఒక్క‌సారి  వారి సెక్స్ జీవితాల్లోకి  తొంగి చూడాల‌నుకున్నాడు.

దీంతో వెంట‌నే క‌రీనా వైపు చూస్తూ..'పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత క్వాలిటీ సెక్స్ అనేది  అపోహా?  నిజ‌మా?'' అని అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కి బ‌ధులుగా క‌రీనా ''నీకు తెలియ‌దా''? అని స‌మాదానం ఇచ్చింది. ''మా అమ్మ కూడా ఈషో చూస్తుంది. నువ్వు నా సెక్స్ లైఫ్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నావ్'' అని క‌ర‌ణ్ అంటాడు.  వెంట‌నే అమీర్ ఖాన్ ఇలా  అందుకుంటాడ‌ప్పుడు.

''ఇత‌రుల  సెక్స్ లైఫ్ గురించి మాట్లాడితే మీ అమ్మ ఏమీ అనుకోరా?'' అంటూ క‌ర‌ణ్ కి కౌంట‌ర్ వేస్తాడు. క‌రీనాని ఇలాంటి ప్రశ్న‌లు అడుగుతావా? అని వ్య‌గ్యాస్ర్తం సంధించాడు అమీర్. ''కేవలం ఆ ఒక్క విష‌యంలోనే కాదు.

మీ షో చూస్తే ఎవ‌రో ఒక‌రికి అనుమానం రాక‌ త‌ప్ప‌దు. ఎవ‌రో ఒక‌రు  త‌ప్ప‌కుండా ఏడుస్తారు. నువ్వు అంద‌రి నిజాలు  బ‌య‌ట‌పెడ‌తావ్'' అని అమీర్ క‌ర‌ణ్ కి ఒక్క నిమిషం ఊపిరాడ‌కుండా చేసారు. ఇలా ప్రోమో ఆద్యంత స‌ర‌దాగా క‌నిపిస్తుంది. మ‌రి లైవ్ లోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ర‌ణ్-అమీర్-క‌రీనా ఇంకెన్ని సంచ‌ల‌నాల‌కు తెర తీస్తారో చూడాలి.

Full View

Tags:    

Similar News