ఓ టెలికాం కంపెనీ యాడ్ కారణంగా.. చేంజ్ ఈజ్ గుడ్ అనే లైన్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఇది న్యూమరాలజీకి అతికినట్లుగా సరిపోయే సెంటెన్స్. ఏ బాధలున్నాయని చెప్పినా, ఏ సమస్యలకైనా.. పేరులో ఓ చిన్న మార్పు చేసేసుకుంటే.. అదుర్స్ అంటారు న్యూమరాలజిస్టులు. అందరికీ కాకపోయినా కొంతమందికి ఇది బాగానే వర్కవుట్ అవుతోంది.
తన పేరులోకి ఓ హెచ్ ని ఎక్స్ ట్రాగా తగిలించుకుంది తమన్నా. చివర్లో యాడ్ చేసిన హెచ్ ని రాయకుండా.. స్పెల్లింగ్ విషయంలో మిస్టేక్ రాస్తే.. కేకలేస్తుంది కూడా. ఆ తర్వాత బాగానే కలిసొచ్చింది మిల్కీ బ్యూటీకి. ఇప్పుడదే సెంటిమెంట్.. అదే హెచ్ లెటర్ తో డెరెక్టర్ గా మారిన యాంకర్ ఓంకార్ కు కూడా అదృష్టం తెచ్చిపెట్టింది.
గతంలో జీనియస్ ను తీసినపుడు ఓంకార్ తన పేరును మామూలుగానే వేసుకున్నాడు. రాజుగారిగది విషయానికొచ్చేసరికి.. ఓ హెచ్ ను యాడ్ చేసుకున్నాడు. తీసిన ఖర్చుకు 4 రెట్లు కలెక్షన్స్ రాబట్టేస్తోంది ఈ మూవీ. దసరా బ్లాక్ బస్టర్ అని సగర్వంగా వేసుకోగలుగుతున్నాడంటే.. ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్సో అర్ధమవుతుంది. మొత్తానికి తమన్నాకి కలిసొచ్చిన హెచ్.. ఓంకార్ కి కూడా లక్ తెచ్చిపెట్టడేం ఆశ్చర్యకరమే.