పాండా పిల్లల్లా నిద్ర‌పోతారుట‌ ఇద్దరూ

Update: 2015-10-08 05:10 GMT
టాలీవుడ్‌ - కోలీవుడ్‌ ని ఏలేస్తున్న ఓ ఇద్ద‌రు భామ‌లు నిరంత‌రం ప్ర‌యాణాల్లోనే స‌గం జీవితాన్ని గ‌డిపేస్తున్నారుట‌. అంతేనా అస‌లు వీళ్లు ఎప్పుడు నిద్ర‌పోతారో.. ఎప్పుడు తింటారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మైపోతారుట పాపం. అస‌లు నిద్ర పోయేందుకే టైమ్‌ లేని ప‌రిస్థితి ఈ అమ్మ‌ళ్ల‌ను ర‌క‌ర‌కాల అల‌వాట్ల‌కు లోను చేసింది.

ఆ అల‌వాట్ల‌లో కొన్ని వింతైన అల‌వాట్లు ఉన్నాయి. ఈ భామ‌లిద్ద‌రూ ధృవ‌పు ఎలుగు బంటిలా ఎక్క‌డ వీలు చిక్కితే అక్క‌డ నిద్ర‌పోతారుట‌. ఆ సంగ‌తిని ఈ భామ‌లే స్వ‌యంగా చెప్పుకుని తెగ మురిసిపోతున్నారు. అస‌లింత‌కీ ఎవ‌రీ అమ్మ‌ణ్ణులు? అనేగా మీ సందేహం. అవును.. శ్రుతిహాస‌న్‌ - త‌మ‌న్నా గురించే. పండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ నిద్ర‌పోతుంది. ఎలా కుదిరితే అలా కునుకు తీసేస్తుంది. యాంగిల్ కూడా ప‌ట్టించుకోదు. నేను కూడా దానిలాగే అని చెబుతోంది త‌మ‌న్నా. నేను కూడా అదే టైపు. మేమిద్ద‌రం ఒకే టైపు అంటూ శ్రుతిహాస‌న్ కూడా దీనికి వంత పాడుతోంది.

విమానంలో వెళుతుంటే ఓ సీటు దొరికితే చాలు. అదే షూటింగులో ఉంటే ఆన్‌ సెట్స్ ఓ రెండు ప్లాస్టిక్ కుర్చీలు దొరికినా చాలు నేను నిద్ర‌పోయే బెడ్ లా వాడేస్తాన‌ని చెప్పింది శ్రుతి. బాప్ రే .. ఈ రేంజులో టైమ్‌ ని  బ్యాలెన్స్ చేస్తూ ఇంత క‌ష్ట‌ప‌డుతున్నారు  కాబ‌ట్టే ఈ భామ‌లిద్ద‌రూ రెండు చేతులా సంపాదించ‌గ‌లుగుతున్నారు. సంపాద‌న తో పాటే సుఖ‌నిద్ర ఉండ‌కుండా  పోతుంద‌న్న‌మాట‌!
Tags:    

Similar News