తమ్మూ.. ఇప్పుడు బాగా కాస్ట్లీ

Update: 2016-04-01 13:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు మాంచి డిమాండ్ మీద ఉంది. ఒకవైపు వరుస హిట్స్ - మరో వైపు గ్లామర్ షోకి అభ్యంతరాలు చెప్పే అలవాటు లేకపోవడం.. ఈ భామ డిమాండ్ ను అమాంతం పెంచేస్తున్నాయి. దీంతో రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదట మిల్కీ.

బాహుబలి విడుదలైన తర్వాత తమన్నా తన పారితోషికాన్ని భారీగానే పెంచింది. ఇండియాలోనే అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రం కావడంతో.. తమ్మూ డిమాండ్స్ కి తలొగ్గక తప్పలేదు. అయితే.. ఇప్పుడు ఊపిరి చిత్రం విడుదల తర్వాత మళ్లీ రేటు పెంచేసినట్లు సమాచారం. రీసెంట్ ఓ ప్రాజెక్ట్ కోసం తమన్నాను కలిసిన నిర్మాతకు భారీ రేట్ చెప్పి షాక్ ఇచ్చిందట మిల్కీ బ్యూటీ.

ఊపిరి మూవీలో తమ్మూ కేరక్టర్ చెప్పుకోదగ్గదేం కాదు. ఈమె యాక్టింగ్ కూడా గొప్ప పేరేం రాలేదు. అయినా సరే బెంగాల్ టైగర్ - ఊపిరి వంటి  వరుస హిట్స్ కారణంగా రేటు భారీగానే పెంచేసిందని అంటున్నారు.  దాదాపు అన్ని భాషల నుంచి డిమాండ్ ఉండడం, ఆఫర్స్ క్యూ కడుతుండడంతో.. దీన్ని క్యాష్ చేసుకునేందుకు తమన్నా వసూలు విషయంలో స్ట్రాంగ్ గానే ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక బాహుబలి2 తర్వాత ఈమెను అందుకోవడం చాలా మందికి కష్టం అవుతుందేమో.
Tags:    

Similar News