స్వార్దంతో విడగొట్టేవాళ్లెంతో మంది!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోపీ మోహన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రైటర్ గోపీ మోహన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయనా చాలా కాలంగా రైటర్ గా పని చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీనువైట్లతో గోపీ కాంబినేషన్ ఎంతో పెద్ద సక్సెస్ సాధించింది. 'రెడీ',' కింగ్',' నమో వెంకటేశ', 'దూకుడు', ' బాద్ షా' ఇలా ఎన్నో సక్సెస్ పుల్ చిత్రాలొచ్చాయి. స్టోరీ రైటింగ్ తో పాటు స్క్రీన్ ప్లే రైటింగ్ లోనూ గోపీ మోహన్ దిట్ట. ఎన్నో సినిమాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. రైటింగ్ కంటే ముందు రెండు..మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు.
అలా మొదలైన ప్రయాణం అతన్ని పూర్తి స్థాయి రైటర్ గా మార్చింది. దర్శకుడు గానూ టర్న్ తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి గానీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోపీ మోహన్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లోనే...' 'ఇంజనీరింగ్ పూర్తవుతున్న సమయంలో సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. మణిరత్నం , కృష్ణవంశీ సినిమాలు చూసి దర్శకుడిని అవ్వాలనుకున్నా.
సినిమాల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్, ఆర్పీ పట్నాయక్ , దశరథ్ పరిచయమయ్యారు. అప్పుడప్పుడే వాళ్లకి అవకాశాలు వస్తున్నాయి. అలా వాళ్లతో కలిసి నా ప్రయాణం మొదలైంది. నేను ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తున్నా ముందుగా వాళ్ల మైండ్ సెట్ ను అర్థం చేసుకుని అందుకనుగుణంగా మారుతాను. మాస్ మసాలా సినిమాలకు పెద్దగా సూట్ అవ్వను. కొంతమంది దర్శకులు .. కొన్ని కథలు నాకు సెట్ కావని అనుకున్నప్పుడు నేను ట్యూన్ కాలేనని అనిపించినప్పుడు తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి.
కాకపోతే ఆ పని సున్నితంగా చేసేవాడిని. ఎవరితోనూ ఎలాంటి వివాదాలు లేవు. ఇక్కడ ఎప్పుడూ ఈర్ష్య ద్వేషాలతో కాళ్లు పట్టుకుని లాగేయాలని చూసేవాళ్లు ఉంటారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నడుస్తుంటే, ఆ కాంబినేషన్ ను ఎలాగైనా? బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది తమ స్వార్థం కోసం ఒక్కో చుక్కా విషం వేసి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ను విడదీసినవారిని , విడగొట్టినవారిని నేను చూశాను. ఇలాంటి ధోరణి నాకస్సలు నచ్చ' అని అన్నారు.